“ఆ చిన్న పదం కట్ చేశారు కానీ ఈ మాటలు ఎలా వదిలేశారు..?” అంటూ… “బేబీ” సినిమాపై నెటిజెన్ల కామెంట్స్..! విషయం ఏంటంటే..?

“ఆ చిన్న పదం కట్ చేశారు కానీ ఈ మాటలు ఎలా వదిలేశారు..?” అంటూ… “బేబీ” సినిమాపై నెటిజెన్ల కామెంట్స్..! విషయం ఏంటంటే..?

by kavitha

Ads

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన ట్రయాంగిల్‌ లవ్ స్టోరీ మూవీ బేబీ. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసున్న విషయం తెలిసిందే.

Video Advertisement

మొదటిరోజే రూ. 7 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.10.93 కోట్లు షేర్ ను వసూల్ చేసింది. బ్రేక్ ఈవెన్ చేయడమే కాకుండా రూ.4.73 కోట్ల లాభాలను తెచ్చి, సూపర్ హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రాన్ని చూసిన నెటిజెన్లకు సెన్సార్‌ విషయంలో సందేహం వస్తోందని కామెంట్లు వీబీపిస్తున్నాయి. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
baby-movie ‘బేబీ’ మూవీని చూసినవాళ్లకు సెన్సార్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్‌ ఒక మూవీ నుండి మరొక మూవీకి రూల్స్ లో ఏమైనా మార్పులు ఉంటాయా అనే సందేహం వస్తోంది అని అంటున్నారు. దానికి కారణం ఏంటి అనేది బేబీ మూవీ చూసినవారికి తెలుస్తుంది. లేదంటే ఆ మూవీ చూసినవాళ్లను అడిగినా ఈ విషయంలో క్లారిటీ వస్తోంది. ఇక ఈ విషయం పై సోషల్‌ మీడియాలో కూడా కామెంట్లు బాగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే బేబీ మూవీలో బూతులను ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించారని టాక్.
అమ్మాయిలని అస‌భ్యకరంగా తిట్టే ఒక పదం ఈ చిత్రంలో అనేక సార్లు వినిపించిందట. అయితే కొన్నిచోట్ల మాత్రమే  తిట్టు వాడినపుడు బీప్ ప‌డింది. కానీ కొన్ని చోట్ల మాత్రం బీప్ లేకుండా అలానే వదిలేశారని అంటున్నారు. అది మాత్రమే కాకుండా కొన్ని మాటలు సెన్సార్ కట్ ను దాటి వచ్చాయని కూడా వినిపిస్తోంది. ఇక ఈ మూవీలో లాంగ్‌ లిప్‌ లాక్‌ను కూడా అలాగే ఉంచేశారట. మరొక చోట కళ్లు – కాళ్లు అనే ఒక డైలాగ్‌ కొంచెం అతి అయ్యిందని అంటున్నారు.
ఓవర్సీస్‌కి వెళ్లిన బేబీ చిత్రంలో ఇలాంటివి ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఈ మూవీలోని డైలాగ్స్ వెబ్ సిరీస్‌లలో ఉండే డైలాగ్స్ తో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉన్నాయని టాక్. దీంతో నెటిజెన్లు ఈ మూవీ విషయంలో సెన్సార్‌ బోర్డ్ ఇలాంటి వాటిని ఎందుకు అలాగే వదిలేసింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read: ఇలాంటి సమస్యల మీద కూడా సినిమాలు తీస్తారా..? ఈ సినిమా చూశారా..?

 

 

 


End of Article

You may also like