Ads
హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తనీష్ హీరోగా నటించిన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ప్రణీత హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ చిత్రం బాగానే ఆడింది. ఆ తరువాత సిద్దార్థ్ హీరోగా నటించిన ‘బావ’మూవీలో హీరోయిన్ గా చేసే అవకాశం కలిగింది.
Video Advertisement
పలు సినిమాలలో నటించిన ప్రణీత లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత తాజాగా భీమన అమావాస్య సందర్భంగా చేసిన పూజకు సంబంధించిన ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే గత ఏడాది ఇలాగే చేసిన ఫోటోకు ఆమె ట్రోలింగ్ కు గురి అయ్యింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రణీత పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ మూవీతో ప్రణీతకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించినప్పటికీ ప్రణీతకు విజయం దక్కలేదు.
ఇక లాక్ డౌన్ సమయంలో బెంగళూరుకు చెందిన బిజినెస్ మెన్ నితిన్ రాజుని ప్రణీత పెళ్లి చేసుకుంది. ఆ తరువాత 2022 జూన్ లో ఒక పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి ప్రణీత అలాగే అందంగా ఉంది. ఇటీవల కాలంలో మునుపటిలా మారి, గ్లామర్ ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాలో తరచుగా షేర్ చేస్తోంది. ప్రణీత గ్లామర్ ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా ఒక ఫోటోను షేర్ చేసింది.
ప్రణీత సుభాష్ తన భర్త నితిన్ రాజుతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. భీమన అమావాస్య సందర్భంగా ప్రణీత తన భర్త పాదాలకు నేలపై కూర్చుని పూజ చేస్తోంది. ఈ ఫోటోకు మీకు ఇది తప్పుగా అనిపించి ఉండొచ్చు. కానీ హిందూ ధర్మంలో దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది అని కాప్షన్ ఇచ్చింది. గత ఏడాది ఇదే భీమన అమావాస్య సందర్భంగా చేసిన ప్రణీత తన భర్త పాదాలకు పూజ చేసిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆమె పై మీమ్స్, ట్రోలింగ్ జరిగింది.
Also Read: ఇలాంటి సమస్యల మీద కూడా సినిమాలు తీస్తారా..? ఈ సినిమా చూశారా..?
End of Article