భార్యలు తమ వైవాహిక జీవితంపై ఆసక్తి కోల్పోవడానికి ముఖ్య కారణాలు ఇవే..!

భార్యలు తమ వైవాహిక జీవితంపై ఆసక్తి కోల్పోవడానికి ముఖ్య కారణాలు ఇవే..!

by Mohana Priya

Ads

సంసారాన్ని చదరంగంతో పోలుస్తారు…ఎందుకంటే మనం వేసే ఒక్క తప్పుటడుగు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది కాబట్టి. కానీ ప్రస్తుత హడావిడి జీవనశైలి మరియు పరిస్థితుల కారణంగా ఆడవారు తమ పార్టనర్‌ పట్ల ఆసక్తిని కోల్పోతున్నారు. క్రమంగా కొంతమంది అయితే అసలు పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకునే స్థితికి వస్తున్నారు.

Video Advertisement

పెళ్లి అనేది కేవలం ఇద్దరు మనుషుల మధ్య జరిగే ఒక తపన కాదు.. అది రెండు మనసులు పరస్పరం ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కలిసి నడిస్తే ఏర్పడే ఒక పవిత్ర బంధం. కానీ ప్రైవసీ, జాబ్, ఇండివిజువాలిటీ ఇలాంటి కారణాల వల్ల చాలామంది తమ జీవితంలో లేని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

indian woman

ఆడవారు ఎప్పుడు కూడా భర్తలు తమని మానసికంగా అర్థం చేసుకోవాలని, నలుగురిలో గౌరవ ,మర్యాదలతో చూసుకోవాలని భావిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో తమ కుటుంబంలో నెలకొంటున్న కలతల కారణంగా తీవ్రమైన మానసిక వత్తిడికి గురి అయిన సందర్భంలో వారు తమ రిలేషన్షిప్ పై ఇంట్రెస్ట్ పూర్తిగా కోల్పోతారు. మరి ఇలా జరగడానికి వెనక కారణాలు ఏమిటో తెలుసుకుందాం..

నమ్మకం ముఖ్యం…

తమ పార్ట్నర్స్ తమను మోసం చేస్తున్నారు అన్న భావన కలిగినప్పుడు లేదు నమ్మకంగా వాళ్ళు మోసం చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఆడవారి మనసు తీవ్ర మనస్థాపానికి గురి అవుతుంది. అలాంటి సందర్భంలో వాళ్లకి తమ పార్ట్నర్ పై పూర్తిగా నమ్మకం పోవడంతో పాటు ఇష్టం కూడా పోతుంది.

woman sad story

కొత్తదనం…

పెళ్లయిన కొంతకాలానికి మగవారికి భార్యలపై ఒక చులకన అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. వాళ్ల గురించి పెద్దగా పట్టించుకోకుండా ఫ్రెండ్స్ ,జాబ్ అని ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. అలాంటి సమయంలో తమ జీవితంలో కొత్తదనం కోల్పోయిన ఆడవారు క్రమంగా తమ పార్ట్నర్స్ పై ఆసక్తిని కూడా కోల్పోతారు. ఎప్పటికప్పుడు మీ లైఫ్ లో వాళ్లు ఎంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని తెలియపరచడంతో పాటు చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇవ్వడం ఒక రిలేషన్ కు ఎంతో ముఖ్యం.

zodiac signs women

గౌరవం..

భార్య కదా అని ఎలా పడితే అలా ఉండొచ్చు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇది పురాణ కాలం కాదు.. నేటితరం యువత తమ భర్త తమకు ప్రేమతో పాటు గౌరవం కూడా ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది లేని చోట క్షణం కూడా ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి మీ జీవిత భాగస్వామిని నీలో సగంగా భావించి ప్రేమించడంతో పాటు గౌరవించడం కూడా ఎంతో ముఖ్యం.

what not to say when a women is angry..!!


End of Article

You may also like