Ads
ఈ వీకెండ్ లో ఇండియాలో వివిధ భాషల్లో చాలా సినిమాలు విడుదలయ్యాయి. మన ప్రాంతీయ భాషల్లో రిలీజ్ అయిన సినిమాలు కంటే చాలావరకు హాలీవుడ్ మూవీస్ కి క్రేజ్ ఎక్కువనే చెప్పవచ్చు. కంటెంట్ క్లిక్ అయితే మూవీ ఏ భాషదైనా మన వాళ్ళు ఎగబడి మరీ హిట్ చేస్తారు. ప్రస్తుతం ‘ఆపెన్ హేమర్’మూవీ చూడడం కోసం మన వాళ్ళు తెగ ఆత్రుత పడుతున్నారు.
Video Advertisement
దీనికి ప్రధాన కారణం అది క్రిస్టఫర్ నోలన్ సినిమా కావడం. బ్యాట్ మాన్ బిగిన్స్, ద డార్క్ నైట్, టెనెట్ లాంటి పలు చిత్రాలు తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మించిన ప్రఖ్యాత దర్శకులలో నోలన్ ఒకరు.
అదే క్రేజ్ తో ప్రస్తుత అతను తెరకెక్కించిన ‘ఆపెన్ హీమర్’ మూవీ మీరు తెలుగు రాష్ట్రాలలో హౌస్ ఫుల్ గా నడుస్తోంది. ఇది ఒక బయోపిక్ చిత్రం.. ఆటంబాంబ్ మరియు హైడ్రోజన్ బాంబ్ యెక్క ఫాదర్ గా పేరు తెచ్చుకున్న ఆపెన్ హీమర్ అనే వ్యక్తి యొక్క జీవిత కథ ఈ చిత్రం. చిన్న వయసులోనే భౌతిక శాస్త్రంలో మంచి పేరు సంపాదించిన ఆపెన్ హీమర్ .. ఆల్బర్ట్ ఐన్స్టీన్ లెగసీని ఎలా ముందుకు తీసుకు వెళ్ళాడు అనే దాని చుట్టూ కథను డెవలప్ చేయడం జరిగింది.
అప్పటివరకు సంభవించే చిన్న విస్ఫోటనాలను ఎన్నో రెట్లు ప్రభావితం చేస్తూ వాటి శక్తిని పెంచడమే కాకుండా హైడ్రోజన్ బాంబులను ఎలా సృష్టించాడు…అసలు ఈ పని అతను ఎందుకు మొదలు పెట్టవలసి వచ్చింది అనే విషయాన్ని ఎంతో స్పష్టంగా చిత్రీకరించారు. సైంటిస్ట్ గా కుతూహలంతో అతను తయారు చేసిన బాంబు ని రెండవ ప్రపంచ యుద్ధంలో వాడడం జరిగింది.
అంతేకాకుండా నష్టం వచ్చాక చివరికి ప్రభుత్వం పెద్దలు మరియు అధికారులు కలిసి ఆపెన్ హీమర్ ను బలిపశువును చేస్తారు. విజువల్ గ్రాండ్ ఇయర్ గా వచ్చినయి చిత్రం ఆద్యంతం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అప్పట్లో ప్రపంచంలో జరుగుతున్న వివిధ రాజకీయాలు, ప్రపంచ యుద్ధం పరిస్థితులు ,చరిత్ర ఎంతో అద్భుతంగా చూపించడం జరిగింది.
సినిమా ముందుకు సాగే కొద్దీ మనకు ఆపెన్ హీమర్ పై మొదట ఏర్పడిన భావన క్రమంగా మారుతుంది. అతని ఎమోషన్స్ కి తెలియకుండానే మనం కనెక్ట్ అవ్వడంతో పాటు అతని ఆవేదనను కూడా అర్థం చేసుకోగలుగుతాం. హైడ్రోజన్ బాంబు తయారు చేసే సమయంలో దానివల్ల కలిగే నష్టాన్ని ఊహించి ఆపెన్ హీమర్ పాత్ర పడే సంఘర్షణ, బాంబు ప్రయోగాన్ని ఆపడానికి అతను చేసే ప్రయత్నం మన హృదయాన్ని తాకుతుంది.సిలియన్ మర్ఫీ 100% ఈ పాత్రకు న్యాయం చేశారు అని చెప్పవచ్చు.
ALSO READ : కల్కి ఫస్ట్ గ్లింప్స్ లో కమల్ ఎక్కడ? కన్ఫ్యూజ్ అయిన రానా..!
End of Article