చనిపోతున్న తన భార్య చివరి కోరిక తీర్చిన భర్త..రియల్లీ హ్యాట్సాఫ్.! ఇంతకీ ఆమె ఏం కోరిందంటే.?

చనిపోతున్న తన భార్య చివరి కోరిక తీర్చిన భర్త..రియల్లీ హ్యాట్సాఫ్.! ఇంతకీ ఆమె ఏం కోరిందంటే.?

by Megha Varna

Ads

మనిషికి  ఎన్నో చేయాలి అని ఉంటుంది. అవి కెరీర్ విషయంలో కావచ్చు, జీవితం విషయంలో కావచ్చు, అలా చాలా పెద్దవి కాకపోయినా ఏదైనా ప్రదేశానికి వెళ్లాలి అనో, ఎవరైనా సెలబ్రిటీ తో ఫోటో దిగాలి లాంటి చిన్న చిన్న కోరికలు అయినా కావచ్చు. చాలామంది ” నేను చనిపోయే లోపు వీటిలో ఒక కోరిక అయినా తీరాలి” అని అంటూ ఉంటారు.

Video Advertisement

కానీ మన జీవితం ముగించే సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కొక్కసారి మనం అంచనా వేసిన దానికి ముందే ఏదో ఒక రూపంలో అలాంటి సమయం వస్తుంది. అప్పుడే ఇలా అనుకున్న కోరికల్లో కొన్ని అయినా నిజం చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి నిజ జీవితంలో ఒక జంటకు ఎదురైంది.

అజూ రమేష్ భార్య భర్తలు వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అజూకి క్రికెట్ ప్రత్యక్షంగా స్టేడియంలో చూడాలి అనే కోరిక ఉండేది. ఎన్నిసార్లు ప్రయత్నించినా స్టేడియం లో చూడటం కుదరలేదు. ఇందాక చెప్పినట్టు జీవితం ముగిసే సమయం ఎప్పుడూ ఎవరికీ తెలీదు. అజూకి అనారోగ్య సమస్యలు వచ్చాయి. అవి మెల్లగా పెద్ద సమస్యలుగా మారాయి. అజూ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించసాగింది. డాక్టర్లు తను ఇంకా ఎక్కువ రోజులు బతకలేదు అని చెప్పారు. అప్పుడు అజూ భర్త రాజేష్ తను ఎప్పటినుండో చూడాలి అనుకుంటున్న క్రికెట్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా స్టేడియం కి తీసుకెళ్ళి చూపించడానికి నిర్ణయించుకున్నాడు. అప్పటికి అజూ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు. కానీ అజూ ఎప్పటినుండో అనుకుంటుంది కాబట్టి, ఇంకా ఎక్కువ సమయం కూడా లేదు కాబట్టి రాజేష్ తగిన జాగ్రత్తలు తీసుకొని తన కోరిక ను ఎలాగైనా నిజం చేయాలి అని నిర్ణయించుకున్నాడు.

తనకి ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి ఎలాగైనా క్రికెట్ టికెట్స్ కావాలి అని చెప్పాడు. ఆఖరికి ఎంతో కష్టం తర్వాత టికెట్లు సంపాదించాడు. పరిస్థితి అందుబాటులో లేకపోతే హాస్పిటల్ కి తరలించడానికి ఆ స్టేడియం దగ్గర్లో ఉన్న ఒక హాస్పటల్లో మాట్లాడాడు, అలాగే స్టేడియంలోని పోలీసులకి కూడా తన పరిస్థితి వివరించాడు. విషయం అర్థం చేసుకున్న పోలీసులు లు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో రాజేష్ కి సహాయం చేశారు. ఇలా ముందే అన్ని ఏర్పాట్లు చేసి జాగ్రత్తగా అజుని క్రికెట్ మ్యాచ్ చూడడానికి తీసుకెళ్లాడు. తను ఎన్నాళ్ల నుండో అనుకుంటున్నది ఇప్పుడు నిజం అవడంతో అజు ఆనందానికి అవధులు లేవు. తన బాధంతా మర్చిపోయి మ్యాచ్ ని ఎంజాయ్ చేసింది. ఇది తన చివరి కోరిక అయింది. క్రికెట్ మ్యాచ్ కి వెళ్లి వచ్చిన కొన్నాళ్ళకే అజు మరణించింది.

ఇదంతా గతేడాది రాజేష్ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. తన భార్య ఎంతో ధైర్యవంతురాలు అని, అతను కొద్ది రోజులకే చనిపోతుంది అని తెలిసినా ఎంతో ధైర్యంగా ఉంది అని, జీవితం ఎంతో విలువైనది, రాబోయే వాటి గురించి గడిచిపోయిన వాటి గురించి ఆలోచించకుండా ప్రస్తుతాన్ని ఆస్వాదించండి, మీకు ఉన్న వాటి కై దేవుడికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పండి, ఆనందంగా ఉండండి అని రాశాడు. ప్రస్తుతం వాళ్ళ కొడుకు తో సమయం గడుపుతున్నాను అని చెప్పాడు.నిజంగానే భవిష్యత్తులో ఎవరికి ఏమవుతుందో ఎవరు ఎలా ఉంటారు ఏమీ చెప్పలేం. అలాగని వాటి గురించి ఆలోచిస్తూ భయపడుతూ కూర్చోవద్దు. అలాగే జరిగిపోయిన వాటిని తలుచుకొని బాధపడొద్దు. ఇప్పుడు ఎలా ఉంది అనేది ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితి గురించి ఆలోచించండి. ఇదే అజూ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం.


End of Article

You may also like