ప్రభాస్ “కల్కి 2898 AD” గ్లింప్స్ కు ఎక్కువ వ్యూస్ ఎందుకు రాలేదు..? కారణం ఇదేనా..?

ప్రభాస్ “కల్కి 2898 AD” గ్లింప్స్ కు ఎక్కువ వ్యూస్ ఎందుకు రాలేదు..? కారణం ఇదేనా..?

by Mohana Priya

Ads

ప్రభాస్ నుంచి మంచి హీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అతని అభిమానులు ప్రస్తుతం తమ ఆశలన్నీ ప్రాజెక్ట్ కే చిత్రం పైనే పెట్టుకున్నారు. అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా వారికి ఎట్టకేలకు చిత్రం నుంచి మొదటి గ్లింప్స్ మరియు ట్రైలర్ విడుదల చేయడం జరిగింది.

Video Advertisement

ప్రభాస్ ఫస్ట్ లుక్ పిక్ పైన కాస్త నెగిటివిటీ వచ్చినప్పటికీ ఓవరాల్ గా చిత్రం పై ఇప్పటివరకు అంచనాలు బాగానే ఉన్నాయి. కల్కి అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌ మరియు ట్రైలర్ యూట్యూబ్ లో మాత్రం అనుకున్నంత స్థాయి రికార్డును సృష్టించలేకపోతున్నాయి.

project-k-first-glimpse

చూసిన అందరూ బాగా ఉంది అని మెచ్చుకుంటున్నప్పటికీ ఎందుకు యూట్యూబ్ లో మాత్రం వీటికి వ్యూస్ పెరగడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దాని వెనక ఓ పెద్ద స్టోరీనే ఉంది బాహుబలి తో మంచి హిట్ సంపాదించిన ప్రభాస్ ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ మూవీస్ అనుకున్న సక్సెస్ను అందించడంలో విఫలమయ్యాయి ఇక ఇప్పుడు ప్రభాస్ లైన్లో ఉన్న అన్ని చిత్రాలలోకి మొదటిగా రిలీజ్ కాబోతోంది కల్కి 2898 AD మూవీ.

సో ఎలాగైనా ఈ మూవీతో హిట్ కొట్టాలి అని ప్రభాసే కాదు అతని ఫాన్స్ కూడా ఆశిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ , టీజర్ మూడు రోజుల్లో కేవలం 18 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. మరోపక్క కొద్ది రోజుల క్రితం విడుదలైన సాలార్ సినిమా టీజర్ విడుదలైన కొద్ది గంటలలోనే 10 మిలియన్ వ్యూస్ ఖాతాలో వేసుకుంది. 24 గంటలు పూర్తి కాకుండా ఏకంగా 83 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోండి ఈ టీజర్.

Prabhas-Project-K-First-Look

మరి అదే హీరో నటించిన కల్కి మూవీ విషయంలో మూడు రోజులైనా 18 మిలియన్ న్యూస్ కూడా ఎందుకు దాటలేదు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. నిజానికి యూట్యూబ్ లో ఏదన్నా ఒక వీడియోకి హై రేంజ్ లో ప్రచారం జరగాలి అన్న ఎక్కువ వ్యూస్ రావాలి అన్నా దానికంటూ ప్రత్యేకించి డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. చాలా వరకు మూవీ టీమ్స్ తమ మూవీ నుంచి విడుదల అవుతున్న కొత్త పాటలు ,టీజర్స్ ,ట్రైలర్ ప్రమోషన్ ఈవెంట్స్ ఇలా అన్నిటిని విపరీతంగా ప్రమోట్ చేయడానికి వ్యూస్ పెంచడానికి భారీ మొత్తంలోనే ఖర్చు పెడతారు.

అయితే ‘కల్కి 2898 AD’మూవీ టీం అలా చేయడానికి ఇష్టపడలేదట. డబ్బులు ఖర్చు పెట్టి వ్యూస్ పెంచుకోవడం కంటే కూడా నిజంగా ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వారు మామూలు పద్ధతిని ఎంచుకుంటున్నారు. ఇండియన్ సినీ చరిత్రలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీస్ లో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ ని షేర్ చేయడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

ALSO READ : ప్రభాస్ కన్నా ముందు… “కల్కి” గా నటించిన హీరో ఎవరో తెలుసా..?


End of Article

You may also like