“ప్రభాస్” నటిస్తున్న” కల్కి 2989 AD” స్టోరీ ఇదేనా..?

“ప్రభాస్” నటిస్తున్న” కల్కి 2989 AD” స్టోరీ ఇదేనా..?

by kavitha

Ads

రెబల్ స్టార్ ప్రభాస్, విశ్వనటుడు కమల్ హాసన్, బిగ్‌బి అమితాబ్, దీపిక పదుకొనే, దిశా పటానీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ‘కల్కి 2989 AD’. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, సినీ ప్రేక్షకులందరు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లింప్స్ తో మేకర్స్  రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ప్రాజెక్ట్ K పేరుతో షూటింగ్ స్టార్ట్ చేసిన మేకర్స్ ఈ మూవీకి ‘కల్కి 2898 AD’ అనే టైటిల్ ను ప్రకటించారు. ఈ మూవీకి టైటిల్ ఇలా పెట్టడానికి కారణం ఏమిటనే విషయం ఆసక్తికరంగా మారింది.
Kalki-2898-AD-story ప్రస్తుతం ‘కల్కి 2898 ‘ అంటే అర్ధం ఏమిటనే చర్చ ప్రారంభం అయ్యింది. ఇక ఈ టైటిల్ పెట్టడం వెనుక పెద్ద కథ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఈ మూవీ కథ ఎలా ఉండబోతుందనే విషయాన్ని నాగ్ అశ్విన్ తెలిపారు. తాను పురాణాలను మరియు సైన్స్ ఫిక్షన్ ను ఇష్టపడతానని, మహాభారతం మరియు స్టార్ వార్స్ ను చూస్తూ పెరిగానని అన్నారు. ఈ 2 ప్రపంచాలను కలిపి ఒక మూవీగా చేయడం అనేది గొప్పగా అనిపించిందని, ఆ విధంగా ‘కల్కి 2989 AD’ వచ్చిందని చెప్పారు.
కల్కి 2898 AD స్టోరీ యుగాంతం బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని సమాచారం. 2898లో అంటే ఫుచర్ లో రాబోయే యుగాంతం ఆధారంగా నాగ్ అశ్విన్ ఈ స్టోరీని రాసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ మూవీని సైన్స్ ఫిక్షన్,  టైమ్ మిషన్ నేపథ్యంలో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. project-k-first-glimpseఈ స్టోరీ గురించి సోషల్ మీడియాలో నెటిజెన్లు సైతం తమ అభిప్రాయాలను చెప్తున్నారు. 18 వ శతాబ్దంలో కొంత, 28 వ శతాబ్దంలో కొంత స్టోరీ జరుగుతుందని, చివరి 20 నిముషాల్లో విలన్ కీలకపాత్ర వహిస్తాడని అంటున్నారు. మరొకరు గ్లింప్స్ ఆధారంగా అమితాబ్ దాచిన వస్తువును కోసం ఒక రోబో 18వ శతాబ్దానికి ప్రయాణిస్తుందని కామెంట్ చేశారు.

Also Read: ప్రభాస్ “కల్కి 2898 AD” గ్లింప్స్ కు ఎక్కువ వ్యూస్ ఎందుకు రాలేదు..? కారణం ఇదేనా..?

 


End of Article

You may also like