Ads
ఇప్పుడు ఉన్న ట్రెండ్ అంతా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. ఏ ప్యాన్ ఇండియా సినిమానో, లేదా బిగ్ హీరో సినిమానో వస్తే తప్ప ప్రేక్షకులు మల్టీప్లెక్స్ వైపు మొగ్గు చూపట్లేదు. కానీ అదే తమ ఫేవరెట్ ఓల్డ్ మూవీ కానీ, లేదా ఫేవరెట్ హీరో పాత సినిమా కానీ మళ్ళీ థియేటర్ లో రిలీజ్ చేస్తే… ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతోంది. కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
Video Advertisement
కొత్తగా వచ్చిన సినిమాల కన్నా… పాత సినిమాలకి క్రేజ్ ఇంకా అలానే ఉంది. ఇటీవలి మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్ గా, ఒక్కడు, పోకిరి సినిమాలు మల్టీ ప్లేక్స్ లో విడుదలయ్యాయి. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, ఆ సినిమాలోపై ఉన్న క్రేజ్ తో హాల్స్ ఫుల్ అయిపోతున్నాయి. పోకిరీ లో డైలాగులకోసం థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు బిజినెస్మేన్ కూడా రిలీజ్ చేస్తున్నారు.
ఈ తరహాలోనే యే యే హీరో పుట్టిన రోజుకీ యే యే సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందో అనే టాక్స్ బాగా వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా…
1 . పవన్ కళ్యాణ్ – 2 September – ఖుషి:
అప్పట్లో ఐకానిక్ హిట్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఖుషిని, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు విడుదల చేస్తే బాగుండు అనుకుంటున్నారు. తమ్ముడు వేసిన హైలైట్ ఉంటుంది అనుకుంటున్నారు.
2. జూనియర్ ఎన్టీఆర్ – 20 May – అదుర్స్
అందరినీ కడుపుబ్బా నవ్వించిన అదుర్స్ మూవీ.. జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆయన పుట్టిన రోజుకి విడుదల చేస్తే మరోసారి తనివితీరా నవ్వుకుని ఆనందిస్తాం అని భావిస్తున్నారు.
3. రవితేజ – 26 January – వెంకీ
ట్రోలర్స్ కి, మీమర్స్ కి, నవ్వుకునే వాళ్ళకి బాగా నచ్చిన సినిమా వెంకీ. మాస్ మహరాజ్ వెంకీ మూవీని, ఆయన బర్త్ డే రోజు రిలీజ్ చేస్తే ఇక ఇళ్ళకథ మాఫిలియనే అంటూ తెగ టాక్స్ నడుస్తున్నాయి.
4. వెంకటేష్ – 13 December – నువ్వు నాకు నచ్చావ్
కేవలం యూత్ ఏ కాదు, ఫ్యామిలీ కూడా ఎంజాయి చేసే సినిమా నువ్వు నాకు నచ్చావు. విక్టరీ వెంకటేష్ మూవీని ఆయన పుట్టిన రోజున మరోసారి వెండి తెరకెక్కిస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు అభిమానులు.
5. చిరంజీవి – 22nd August – ఇంద్ర
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ ఇంద్ర సినిమా థియేటర్లలో వేస్తే రెస్పాన్స్ మాత్రం మామూలుగా ఉండదు.
6. ప్రభాస్ – 23 October – బుజ్జిగాడు
ఆరడుగుల అందగాడు, ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ బుజ్జిగాడిని ఆయన పుట్టిన రోజున వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఏండే బుజ్జిగాడిని ఓసారి ఏయ్యండే అంటూ డైలాగులు చెప్పుకుంటున్నారు.
7. నితిన్ – 30th March – సై
యువతను ఉత్తేజ పరుస్తూ, కాలేజ్ లైఫ్ లో ఏం నేర్చుకోవాలి అని, గోల్ ను ఎలా కొట్టాలి అనే విధంగా అందరి రక్తం మరిగి పోయేలా చేసిన నితిన్ మూవీ “సై” మరోసారి వేస్తే నోట్లో బెల్లం ముక్క పెట్టినంత బాగుంటుంది అంటున్నారు నేటితరం అభిమానులు.
8. బాలకృష్ణ – June 10 – చెన్నకేశవ రెడ్డి
9. నాగార్జున – 29 August – శివ
ఇదే రీతిలో, మెగాస్టార్ సినిమాలు, బాలయ్య సినిమాలు కూడా విడుదల చేస్తే బొమ్మ అదిరిపోతుంది అని ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు అభిమానులు.
End of Article