Ads
తెలుగులో రియాలిటీ షో అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ‘బిగ్ బాస్’ షోనే. ఈ రియాల్టీ షో 6 సీజన్లు పూర్తి చేసుకుంది. ఒక్క ఆరో సీజన్ తప్ప మిగతా సీజన్ల అన్ని సక్సెస్ ఫుల్ అయ్యాయి. త్వరలో బిగ్ బాస్ ఏడవ సీజన్ మొదలు కానుంది.
Video Advertisement
నాలుగు సీజన్ల నుండి బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఈసారి కూడా ఆడియెన్స్ ను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. కానీ షో మొదలవకముందే నాగార్జునకు కోర్టు నోటీసులు పంపించింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఇటీవలే ఏడవ సీజన్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ షో అభిమానులు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ షో మొదట్లో వచ్చిన సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. కానీ ఆ తర్వాత ఈ రియాల్టీ షో పై విమర్శలు ఎక్కువయ్యాయి. సీపీఐ లీడర్ నారాయణ ‘బిగ్ బాస్’ షో పై పలుమార్లు కౌంటర్స్ కూడా వేశారు. ఈ షో వల్ల యువత, పిల్లలు, చెడిపోతున్నారని ఆరోపించారు. హౌస్ లో పోటీదారుల మధ్య అశ్లీలత, అసభ్యకరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని కోర్టులో నారాయణ పిటీషన్ వేశారు. ఆ పిటీషన్ తో హైకోర్టు బిగ్ బాస్ షోని ఆపేయాలని తీర్పు ఇచ్చింది.గతంలో వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ క్రమంలోనే హోస్ట్ నాగార్జునకు మరియు షో ప్రసారం అవుతున్న ఛానెల్‌కి కూడా నోటీసులు ఇచ్చింది. అలాగే ఈ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయాలని వెల్లడించింది. ఈ కేసు నెక్స్ట్ విచారణని నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే గతంలో చాలాసార్లు ఈ షో పై ఇటువంటి పిటిషన్స్ కోర్టులో దాఖలు అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి అడ్డంకి లేకుండా బిగ్ బాస్ షో కొనసాగింది.
Also Read: తన హిట్ సినిమా సీక్వెల్‌తో కం బ్యాక్ ఇవ్వబోతున్న హీరో “నారా రోహిత్” ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా..?
End of Article