Ads
కొంతమంది ఇగోలకు వెళ్ళి భార్యభర్తలు విడిపోతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఎగవకు వెళ్ళి భర్త చెప్పిన మాట వినకుండా పుట్టింటికి వెళ్ళిపోయి, ఇంట్లోనే ఉండి, సంతోషంగా సింగల్ లైఫ్ ను కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు, తల్లిదండ్రులు అది చూసి తట్టుకోలేక ఎవరికి చెప్పాలో తెలియక బాధపడుతున్నారు.
Video Advertisement
అయితే అమ్మాయికి ఎన్ని చెప్పిన వినట్లేదు. పోనీ మరో పెళ్లి చేద్దామా అంటే అక్కడ కూడా ఇదే సమస్య వస్తే ఎలా అని ఆలోచించే పరిస్థితి. అలాంటి అమ్మయిలకు గాని, తల్లిదండ్రులకు గాని ఏం చెప్తారు అని సుమన్ టీవి లైఫ్ ఛానెల్ లో అడిగిన ప్రశ్నకి లైఫ్ కోచ్ ప్రియ చౌదరిగారు ఇలా చెప్పుకొచ్చారు.చదువు అనేది ప్రస్తుతం ఉన్న ఆడపిల్లలను ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వల్ల జీవితాన్ని నిలబెట్టుకుంటూ, తల్లిదండ్రుల తమ కోసం పడిన కష్టాన్ని అర్ధం చేసుకుని, ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారు. అదే సమయంలో ఆర్ధికంగా నిలబడి తల్లిదండ్రులకు చాలా ఊతం ఇస్తున్నారు.
ఇది కాయిన్ కు ఒక వైపు. కానీ మరో వైపు బాధ్యత లేనటువంటి ఆడపిల్లలు నేను బాగా చదువుకున్నాను. నేను డిగ్రీ హోల్డర్ ని, నాకేంటి, ఎలాగైనా బ్రతికేస్తా అనే వైఖరి కనిపిస్తోంది. బాధ్యత లేని ఆడపిల్లలు ఒక విధనమైన ఇగో లేదా పొగరును చూపిస్తున్నారు. చేతిలో డిగ్రీ ఉందని, తామే గొప్పవారమనే భావనలో బయటికి వచ్చి, చేతిలో డిగ్రీ ఉందని, ఫాల్స్ థింకింగ్ లో ఉండిపోతున్నారు. ఎక్కడికెళ్ళినా, వీళ్ళు మాట్లాడిన మాటే జరగాలి అనే మొండితనంతో ప్రవర్తిస్తున్నారు.
ఈ మొండితనంను చిన్నతనం నుండే గమనించాల్సి ఉంటుంది. ఆ లక్షణాన్ని గమనించినపుడే వారికి నేర్పాల్సి ఉంటుంది. ఇగో అనేది ఆడపిలల్లకు పుట్టింట్లోనే చిన్నతనం నుండే ఎదిగేటపుడు వారితో పాటు ఎదుగుతూ వస్తుంది. ఇంట్లో వాళ్ళదే పై చేయిగా ఉండాలని, పెత్తనం చేయాలని చూస్తుంటారు. వాళ్ళకి జీవితం విలువ తెలియదు. అలాంటి వాళ్ళకి డబ్బు కూడా తెలియదని చెపుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్రింది వీడియోను చూడండి..
watch video:
Also Read: ముగ్గురు ఆడపిల్లలు… బాధ్యతల భారం… కానీ..! ఈ మహిళ గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!
End of Article