LGM REVIEW : “మహేంద్ర సింగ్ ధోనీ” నిర్మించిన మొదటి సినిమా LGM ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

LGM REVIEW : “మహేంద్ర సింగ్ ధోనీ” నిర్మించిన మొదటి సినిమా LGM ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

మహేంద్ర సింగ్ ధోనీ. పరిచయం అక్కర్లేని వ్యక్తి. క్రికెటర్ గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ధోనీ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. తన భార్య సాక్షి సింగ్ ధోనీని నిర్మాతగా పరిచయం చేస్తూ తమిళ్ లో లెట్స్ గెట్ మ్యారీడ్ అనే సినిమా తీశారు. ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : LGM (లెట్స్ గెట్ మ్యారీడ్)
  • నటీనటులు : హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా.
  • నిర్మాత : సాక్షి సింగ్ ధోనీ, వికాస్ హసిజా.
  • దర్శకత్వం : రమేష్ తమిళమణి
  • సంగీతం : రమేష్ తమిళమణి
  • విడుదల తేదీ : జూలై 28, 2023

lgm movie review

స్టోరీ :

ఒక ప్రేమ కథగా సినిమా మొదలవుతుంది. గౌతమ్ (హరీష్ కళ్యాణ్), మీరా (ఇవానా) రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. అయితే మీరా పెళ్లయ్యాక గౌతమ్ తల్లి (నదియా) తో కలిసి ఉండడానికి తనకి ఇబ్బంది అని గౌతమ్ తో చెప్తుంది. కానీ తన తల్లిని విడిచి తాను ఉండలేను అని గౌతమ్ చెప్పడంతో, మీరా గౌతమ్ తల్లిని, అలాగే మిగిలిన తన కుటుంబ సభ్యులను తీసుకొని ఒక ట్రిప్ కి వెళ్దాము అని, ఆ ట్రిప్ లో గౌతమ్ తల్లిని తాను బాగా అర్థం చేసుకోగలుగుతుంది అని అనుకుంటుంది.

lgm movie review

అలాగే గౌతమ్ తల్లికి కూడా మీరా గురించి బాగా తెలుస్తుంది అని గౌతమ్ కి సలహా ఇస్తుంది. అలా వారు ట్రిప్ కి వెళ్తారు. అక్కడ వాడు వాళ్లు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? మీరా, గౌతమ్ తల్లికి మధ్య ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి? అసలు ఈ ట్రిప్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసుకున్న గౌతమ్ తల్లి ఏం చేసింది? గౌతమ్ అక్కడ ఉన్న పరిస్థితులని ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

ఈ సినిమా గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. అందుకు ముఖ్య కారణం ఈ సినిమా నిర్మాత ధోనీ కావడమే. ధోనీకి నిర్మాతగా ఇది మొదటి సినిమా. అందులోనూ తమిళ్ లో ధోనీ సినిమా తీయడం అనేది ఇంకా ఆసక్తికి దారితీసింది. సినిమా కథ అంతా కూడా దాదాపు ట్రైలర్ లోనే చెప్పేశారు. అలాగే సినిమాలో హీరో హీరోయిన్ల ప్రేమ కథకు ఎక్కువ సమయం తీసుకోకుండా, సినిమా స్టార్టింగ్ లోనే వారిద్దరూ ప్రేమలో ఉన్నట్టు చూపిస్తారు.

lgm movie review

కథ కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఒక కోడలు తనకి కాబోయే అత్త గారి గురించి తెలుసుకొని, ఆమెను బాగా అర్థం చేసుకోవాలి అనుకోవడం అనే పాయింట్ డిఫరెంట్ గా ఉంది. సినిమా మొత్తం ఆ ఒక్క పాయింట్ మీద నడిస్తే ఇంకా బాగుండేది ఏమో అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో అనవసరమైన చాలా అంశాలు ఈ సినిమాలో యాడ్ చేశారు. అవి ఎంటర్టైన్మెంట్ అందించడం పక్కన పెడితే, చూసే ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తాయి.

lgm movie review

అస్సలు నవ్వు రాని జోక్స్, పాతకాలపు పంచ్ లైన్స్ ఇవన్నీ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఏదో ఒక రకంగా కొంచెం చూడొచ్చు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. సాధారణంగా సినిమా ముందుకి వెళ్లే కొద్ది ఆ పాత్రలు కూడా ఎమోషనల్ గా చాలా పరిణితి పొందినట్టు చూపిస్తారు. అంతే కాకుండా కుటుంబ విలువలు అనే కాన్సెప్ట్ మీద సినిమా చూపించినప్పుడు, ఆ కుటుంబం అంతా ఒకచోట ఉన్నప్పుడు ముందు గొడవలు వచ్చినా కూడా, తర్వాత వాళ్ళు ఎలా సర్దుకుపోయారు, ఒకరిని ఒకరు ఎలా అర్థం చేసుకున్నారు అనే విషయాన్ని చూపించాలి.

lgm movie review

కానీ ఈ సినిమాలో అదే లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో మంచి నటీనటులు ఉన్నారు. హీరో హరీష్ కళ్యాణ్ తన పాత్రకి న్యాయం చేశారు. లవ్ టుడే సినిమాతో తెలుగులో కూడా ఫేమస్ అయిన ఇవానా కూడా పాత్రకి తగ్గట్టుగా నటించారు. నదియా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. పాటలు కూడా పెద్ద చెప్పుకోదగ్గ అంత స్థాయిలో ఏమీ లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగానే అనిపిస్తుంది.

lgm movie review

సినిమా కెమెరా యాంగిల్స్ అయితే చాలా విచిత్రంగా ఉంటాయి. అలాగే పులి గ్రాఫిక్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ప్రముఖ కమెడియన్ యోగి బాబు, మిర్చి విజయ్ చేసిన కామెడీ అయితే ఎంత ప్రయత్నించినా కూడా నవ్వు రాదు. అలాగే ఇంకా కొంత మంది స్పెషల్ రోల్స్ లో సర్ప్రైజ్ ఇచ్చారు. కానీ అవి సర్ప్రైజ్ లాగా అనిపించవు. ఎడిటింగ్ కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటులు
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • అనవసరమైన కామెడీ
  • ఎడిటింగ్
  • పాత్రలని చిత్రీకరించిన విధానం
  • సహనానికి పరీక్ష పెట్టే సీన్స్

రేటింగ్ :

2/5

ట్యాగ్ లైన్ :

సినిమా కోసం ఎంచుకున్న స్టోరీ లైన్ బాగున్నా కూడా దాన్ని తెరపై చూపించే విధానంలో తీవ్రంగా విఫలం అయ్యారు. అస్సలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఏదో ఒక సినిమా చూద్దాం అనుకునేవారు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు చూడగలుగుతారు. పేపర్ మీద మంచి పాయింట్ ఉన్నా కూడా తెరపై నిరాశపరిచిన సినిమాల్లో ఒకటిగా లెట్స్ గెట్ మ్యారీడ్ సినిమా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : అంత ట్రోల్ చేస్తున్నారు..! కానీ అసలు విషయం ఏంటో తెలుసా..?


End of Article

You may also like