Ads
ప్రభాస్. ఇప్పుడు ఈ పేరు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. కట్ ఔట్ ఫిజిక్, హైట్ తో అమ్మాయిలని పిచ్చెకించిన ప్రభాస్ కు…బాహుబలితో డై హార్డ్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Video Advertisement
అయితే తాజాగా ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ లో ఊహించని వీడియోలు విడుదల అయ్యాయి. దీంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఏంటి ఇది నిజంగా డార్లింగ్ ప్రభాస్ ఏ పోస్ట్ చేశాడా అని కన్ఫ్యూషన్ లో పడిపోయారు.
అయితే ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, తాజాగా థ్రెడ్స్ వంటి ఎన్ని యాప్ లు ఉన్నా అభిమానులకు దగ్గరగా ఉండేందుకు ప్రభాస్ ఫేస్ బుక్ నే ఎక్కువగా వాడుతుంటారు. డార్లింగ్ తన ఫేస్ బుక్ అకౌంట్ ను అక్టోబర్ 18, 2013 న క్రియేట్ చేసుకోగా… ప్రస్తుతం 24 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. కానీ ప్రభాస్ మాత్రం కేవలం రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నారు. మరి ఇంత క్రేజ్ ఉన్న ప్రభాస్ ప్రభాస్ ఏదైనా పోస్ట్ పెడితే అభిమానులు హడావిడి మాములుగా ఉండదు.
ఈ సమయంలోనే ప్రభాస్ ఫేస్ బుక్ లో రెండు వీడియోలు పోస్ట్ అయ్యాయి. అందులో ఒకదానికి అన్ లక్కీ హ్యూమన్స్ అంటే మనుషులు దూరదృష్ట వాంతులు అని ఒక వీడియోకి, బాల్ ఫాల్స్ అరౌండ్ ది వరల్డ్ అని ఇంకో వీడియోకి క్యాప్షన్స్ పెట్టిన వీడియోలు విడుదల అయ్యాయి. అప్పుడే విషయం తెలుసుకున్న ప్రభాస్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ టీం అలెర్ట్ అయ్యి… ఫేస్ బుక్ హ్యాక్ అయ్యిందని తెలుసుకున్నారు. ఇక వెంటనే సరి చేసే పనిలో పడి వీడియోలను తొలగించి… ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ ను సెట్ చేసి పునరుద్ధరించారు. దీంతో ప్రభాస్ అభిమానులు కుదుట పడ్డారు.
ALSO READ : అప్పుడేమో ఆ హీరోని CM అన్నావు… ఇప్పుడు ఈ హీరోని CM అంటున్నావు..! ఏంటమ్మా ఊర్వశి ఇది..?
End of Article