పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ “బ్రో” సినిమాలో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ “బ్రో” సినిమాలో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?

by Mohana Priya

Ads

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాలో మరొక మెగా హీరో అయిన సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా నటించారు. ఈ సినిమా తమిళ్ లో రూపొందిన వినోదయ సిత్తం సినిమాకి రీమేక్. కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు రాశారు.

Video Advertisement

అలాగే కథ పరంగా కూడా కొన్ని మార్పులు చేశారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహించారు. సినిమా రిలీజ్ అయ్యాక కొంచెం సేపు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత నుండి మిక్స్డ్ రివ్యూస్ రావడం మొదలయ్యాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు అని అంటున్నారు. అసలు ఈ సినిమాకి మైనస్ అయిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

#1 సాధారణంగానే ఈ మధ్య వచ్చే తెలుగు సినిమాల పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. దాంతో ఇది పవన్ కళ్యాణ్ సినిమా అవడంతో ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ ఉన్నట్టు సెకండ్ హాఫ్ ఉండి ఉంటే ఈ కామెంట్స్ కూడా వచ్చేవి కావు అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మీద పెట్టిన శ్రద్ధలో సగం కూడా సెకండ్ హాఫ్ లో పెట్టలేదు అనిపిస్తుంది.

bro movie review

దర్శకుడు చెప్పాలి అనుకున్న పాయింట్ బాగున్నా కూడా దాన్ని తెరపై చూపించడంలో చాలా లోపాలు కనిపించాయి. క్లైమాక్స్ కాస్త కొత్తగా ఉన్నా కూడా అది ప్రేక్షకులు ఎంతవరకు అంగీకరిస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ సెకండ్ హాఫ్ మీద మాత్రం చాలా కామెంట్స్ వస్తున్నాయి.

bro movie review

#2 సినిమాలో పవన్ కళ్యాణ్ పాత సినిమాల రిఫరెన్స్ లు ఉంటాయి అని ముందే చెప్పారు. మనకి ట్రైలర్ చూశాక ఆల్రెడీ ఈ విషయం అర్థం అయిపోయింది. ఆ రిఫరెన్స్ ఏదో కొంచెం సేపు ఉంటే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది. అభిమానులకి ఈ సీన్స్ అన్ని ఒక సెలబ్రేషన్ లాగా అనిపిస్తాయి. కానీ కామన్ ఆడియన్స్ అభిప్రాయపరంగా చూస్తే ఇవి కాస్త ఎక్కువగానే ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. చాలా మంది హీరోల సినిమాల్లో వారి పాత వింటేజ్ సినిమాలో రిఫరెన్స్ లు చూపిస్తున్నారు.

bro movie review

కానీ ఈ సినిమాలో అవి మోతాదుకు మించి ఉన్నాయి అని అంటున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ మీద మాత్రమే ఫోకస్ చేసి సినిమా మొత్తం నడిపించాలి అనుకున్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మీద అలా ఫోకస్ చేయడం అనేది మంచి విషయం అయినా కూడా, మిగిలిన ముఖ్యమైన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది అని అంటున్నారు.

bro-movie

#3 ఇలాంటి సినిమాకి మెయిన్ ఉండాల్సినవి ఎమోషన్స్. ఈ సినిమాలో అవి ఉన్నాయి. కానీ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. తమిళ్ లో 50 దాటిన ఒక వ్యక్తి అహంకారంతో ఉన్నట్టు చూపిస్తారు. తెలుగులో 30 ఏళ్ళు వచ్చిన ఒక వ్యక్తి తన తండ్రి తర్వాత బాధ్యతలు తీసుకొని తన గురించి తాను పెద్దగా పట్టించుకోలేదు అన్నట్టు చూపిస్తారు.

ఇలా చూపించడం బానే ఉంది. కానీ ఎమోషన్స్ పరంగా ఒరిజినల్ తో పోల్చి చూస్తే ఈ పాయింట్ ప్రేక్షకులకు కాస్త తక్కువగా కనెక్ట్ అయ్యింది. అంతే కాకుండా క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి ఇంక సినిమా అయిపోవడానికి వచ్చింది, కాబట్టి ఒక ఎమోషనల్ సీన్ పెట్టి సినిమాని కరెక్ట్ గా ఎండ్ చేయాలి అని ఏదో హడావిడిలో ఆ ఎమోషనల్ సీన్స్ వచ్చినట్టు అనిపిస్తాయి. ఇంకా కొంచెం సహజంగా ఉండి ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది అనే కామెంట్స్ వస్తున్నాయి.

#4 ఇలాంటి సినిమాకి, అందులోనూ ఒక పెద్ద హీరో నటిస్తున్న సినిమాకి పాటలు చాలా ముఖ్యమైనవి. ప్రేక్షకులకి పాటలు ఎక్కితేనే తర్వాత సినిమాపై కూడా ఆసక్తి ఇంకా పెరుగుతుంది. కానీ సినిమాలో ఉన్న పాటలు ఏవి ప్రేక్షకులకి నచ్చలేదు. బ్రో అనే పాట బానే ఉంటుంది. మిగిలిన పాటలు ఏవి కూడా ప్రేక్షకులకు గుర్తుండవు. అసలు హీరో హీరోయిన్ కి మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్ అయితే వినడానికి, చూడడానికి ఏ రకంగా కూడా గొప్పగా అనిపించదు. కొత్తదనం లోపించినట్టు అనిపిస్తుంది. ఆ పాటలకంటే పవన్ కళ్యాణ్ పాత పాటలు కొన్ని సినిమాలో వాడారు. ఇన్ని సంవత్సరాల తర్వాత విన్నా కూడా అవి కొత్తగా అనిపించాయి అని అంటున్నారు.

bro movie review

#5 సినిమాకి డైలాగ్స్ అనేవి బలం. డైలాగ్స్ ఎంత బాగుంటే సినిమా ప్రేక్షకులకు అంత బాగా కనెక్ట్ అవుతుంది. అలాంటి డైలాగ్స్ రాయడంలో స్పెషలిస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్. కానీ ఈ సినిమాలో ప్రాస పేరుతో త్రివిక్రమ్ రాసిన కొన్ని డైలాగ్స్ మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. అసలు ఒక పాయింట్ తర్వాత ఈ డైలాగ్స్ త్రివిక్రమ్ రాశారా అని అనుమానం కూడా వస్తుంది.

bro movie review

అంతే కాకుండా ఈ సినిమాలో చేసిన మార్పులు కూడా నిరాశ పరిచాయి. ముఖ్యంగా హాల్లో షర్ట్ విప్పొచ్చు అనే డైలాగ్, అందులో ప్రాస కోసం వాడిన కొన్ని పదాలు వినడానికి ఇబ్బందికరంగా కూడా అనిపించాయి. కొన్ని డైలాగ్స్ బాగానే ఉన్నా కూడా మిగిలిన చోట్ల డైలాగ్స్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

bro movie review

ఏదేమైనా సరే ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది. కొంత మంది, “పాత పవన్ కళ్యాణ్ సినిమాల రిఫరెన్స్ లు ఉన్నాయి కాబట్టి, ఫ్యాన్స్ కి పండగ” అని అంటూ ఉంటే, మరి కొంత మంది మాత్రం, “అది మాత్రమే ఉంటే సరిపోదు కదా? కథ విషయంలో కూడా చెప్పుకోదగ్గ విషయాలు ఏమైనా ఉండాలి కదా?” అని అంటున్నారు. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.

ALSO READ : “కల్కి 2898 ఏడీ” సినిమాలో ప్రభాస్‍ను ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే..?


End of Article

You may also like