చర్చలకు దారి తీస్తున్న “సుధా మూర్తి” కామెంట్స్..! ఆహారపు అలవాట్ల గురించి ఆమె ఏం అన్నారంటే..?

చర్చలకు దారి తీస్తున్న “సుధా మూర్తి” కామెంట్స్..! ఆహారపు అలవాట్ల గురించి ఆమె ఏం అన్నారంటే..?

by Anudeep

Ads

ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్ అయిన సుధా మూర్తి ఓ కంపెనీ యజమాని కంటే కూడా ఎక్కువగా… ఆమె ప్రసంగాలతోనే అందరికీ బాగా తెలుసు. మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఎంతో మంది ఆదరణ పొందారు. అయితే తాజాగా సుధా మూర్తి ఓ ఛానెల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.

Video Advertisement

వాస్తవానికి సుధా మూర్తి శాఖాహారి. కాబట్టి తన ఆహారపు అలవాట్లు కాస్త భిన్నంగానే ఉంటాయి. ఆమె ఆలోచనలు కూడా అంతే భిన్నంగా ఉంటాయి. అందుకే ఎంతో మంది ఆదరిస్తుంటారు. కానీ ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆహారానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కాస్తా కాంట్రవర్సీగా మారాయి.

” నేను శాఖాహారిని కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను కానీ తేలికైన ఆహారాన్నే తింటాను వొండుతాను. కొన్ని సార్లు బయట హోటళ్లకు వెళితే మాంసాహారానికి ఉపయోగించిన గరిటెలే వాడతారేమో అనే భయంతో… పెద్దగ్గా హోటళ్లకు వెళ్ళను. వెళ్ళినా చాలా ఆచి తూచి ఆలోచించు చూసుకుని శాకాహార హోటల్ అయితేనే వెళతాను. ఇక నా వంటల విషయానికి వస్తే నేను వొంద రకాలు చెయ్యలేక పోవచ్చు కానీ… నాకు వచ్చిన వాటిల్లో చాలా తేలికగా అరిగే వంటకాలు చేస్తాను.

“టీ, అటుకులు, చారు, కూర, చపాతీలు వంటివి ఇలా చాలా సింపుల్ వంటకాలనే చెయ్యగలను. ఇదిలా ఉంటే ఫారెన కంటీలకు పని మీద వెళ్ళినప్పుడు కూడా నాతో ప్రత్యేకంగా ఒక చిన్న కుక్కర్ తీసుకు వెళతాను. 25,30 చపాతీలు, రోస్టెడ్ సూజీని తీసుకెళ్తాను. ఇవి చాలా సింపుల్ గా వేడి నీటిలో కలిపితే తినగలిగేలా ఉంటాయి. నేను మా భర్త ఇలానే చాలా సింపుల్ ఆహారాన్ని తీసుకుంటాం” అని ఆ ఇంటర్వ్యూలో సుధా మూర్తి చెప్పుకొచ్చారు.

Sudha-Murthy

ఈ వీడియో కాస్త వైరల్ గా మారి ట్విట్టర్ లో నెటిజన్లు దుమ్మేటిపోస్తున్నారు. ఇక సుధా మూర్తి అల్లుడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఓ మాంసాహారేగా అంటూ సునాక్ నాన్ వెజ్ తింటున్న ఫోటోలను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. మరి వాళ్ళ అల్లుడికి ఇంకొక గరిట ఉంటుందా అంటూ విమర్శించారు. ఇంకొందరైతే ఇక ఇంతలా ఉన్న గొప్ప వ్యక్తి అసలు ముస్లింలు ఉండే ప్రాంతంలో కనీసం టీ అయినా తాగుతారా అంటూ తూట్లు పొడిచారు. మొత్తంగా ఒకప్పుడు సుధా మూర్తి మోటివేషన్ ఇచ్చేవిగా స్పీచ్ లు కాస్త… ఆ యూట్యూబ్ ఛానెల్ లోని ఇంటర్వ్యూ ద్వారా ఏకంగా ఇతర వర్గాల వారి మనోభావాలు దెబ్బ తీసాయనే చెప్పొచ్చు.

ALSO READ : మరి విడ్డూరం కాకపోతే..! ఇలాంటి కారణంతో కూడా జాబ్ ఇవ్వరా..?


End of Article

You may also like