Ads
మిల్క్ బాయ్ మహేష్ బాబు రోజు రోజుకు ఇంకా యంగ్ కుర్రాడిలా తయారు అవుతున్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ తనదైన స్టార్ డమ్ క్రియేట్ చేసుకుని… ప్రస్తుతం మంచి మెసేజ్ ఇస్తూనే ఫ్యామిలీని ఎంటర్టేయిన్ చేసే విధంగా సినిమాలు చేస్తూ అందరి మెప్పును, ప్రేమాభమానాను పొందుతున్నారు.
Video Advertisement
ఇక జక్కన్న విషయానికి వస్తే అన్నీ హిట్ సినిమాలే తన ఖాతాలో ఉండాలని నిర్ణయించుకుంటారు. రాజమౌళి సినిమా అంటే కచ్చింతంగా ఒక ప్రత్యేక ముద్ర ఉండాలని నిశ్చయించుకుంటారు. అందుకే ఎక్కడా కాంప్రొమైజ్ అవ్వకుండా తనదైన స్టైల్లో అనుకున్నది అనుకున్నట్లు సినిమాలు తీస్తారు.
ఇక తాజాగా మహేష్ బాబుతో జక్కన్న భారీ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక పీక్ లెవెల్ లో ఉండబోతుందట. ఏకంగా హాలీవుడ్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే విధంగా ఉండబోతుందట. ఈ సినిమాలో చాలా కొత్తదనం, ఇతర భాషా కళాకారులు, సన్నివేశాలు అదిరిపోయేలా ఉంటాయన్న టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో రాజమౌళి తీసేది ఇదే తొలి చిత్రం కాదంట.
ఒకప్పుడు రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో మహేష్ బాబు నటించిన రాజకుమారుడు మంచి కమర్షియల్ హిట్ అవ్వగా… ఈ సినిమాకి రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారట. అంతే కాదు కొన్ని సీన్స్ ని రాజమౌళినే తీశారని వార్త కూడా ఉంది. ఈ లెక్కన మహేష్ బాబుతో రాజమౌళి దాదాపు 25 ఏళ్ల తరువాత… ఇరువురికి ఒక స్టార్ ఇమేజ్ వచ్చాక కలిసి చేస్తున్న రెండో సినిమా అనే చెప్పొచ్చు. రాజమౌళి తీయబోయే చిత్రాలు ఖాతాలో ఎన్నో ఉండగా… ప్రస్తుతం మహేష్ బాబుతో తీసే సినిమాపై భారీగా ప్లాన్ చేస్తున్నారు. దీనికి సుమారు 3,4 ఏళ్ళు పట్టచ్చని తెలుస్తోంది.
ALSO READ : అల్లు అర్జున్ తో ఛాన్స్ వొద్దన్న శ్రీలీల..? ఎందుకో తెలుసా??
End of Article