Ads
నయనతార నిరంతరం వార్తల్లో వస్తూనే ఉంటారు. తన పెళ్లి కారణాల వల్ల కావొచ్చు, సరోగసీ ద్వారా పిల్లలని కన్న విషయంలో కావొచ్చు ఏదో ఒక కారణంగా నిరంతరం వార్తల్లో ట్రెండింగ్ లో ఉంటారు. ఇక ఓ ప్రమోషన్ ఈవెంట్ నయనతార గురించి విశాల్ మాట్లాడటం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
Video Advertisement
అయితే నటుడు విశాల్, నటి ప్రీతివర్మ, ప్రతినాయకుడిగా ఎస్ జే సూర్య నటించిన సినిమా మార్క్ ఆంటోనీ సినిమా ప్రమోషన్స్ పనిలో ఉన్నారు.
సెల్వరాఘవన్ ద్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మించగా… జీవీ ప్రకాష్ కుమార్ సింగీతం అందించారు, అలాగే అధిక్ రవిచంద్రన్ దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. ఈ మేరకు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీం ఉంటే… ఓ విలేఖరుడు విశాల్ ను నయనతార గురించి ఓ ప్రశ్న అడిగారు.
నయనతార సినిమా ప్రమోషన్స్ లో ఎందుకు పాల్గొనరు? కారణం ఏంటని అడగ్గా… అది తన పర్సనల్ ఛాయిస్. ప్రమోషన్స్ కి రావాలా వొద్దా అన్నది తన ఇష్టం. అది తన హక్కు. దానిని ఎవరూ కాదనలేం. నిజానికి వస్తె బాగుంటుంది కానీ తనకి రావాలని లేనప్పుడు ఒత్తిడి చెయ్యలేం కదా. ఏదేమైనా అది తన వ్యక్తిగత నిర్ణయం అంటూ విశాల్ చెప్పుకొచ్చారు. దీంతో అటు సినీ వర్గాల్లో కూడా నయనతార ప్రమోషన్స్ కి రాకపోవడం పట్ల చాలా మందికి ఒకలాంటి నిరాశే ఉందని చెప్పొచ్చు.
ALSO READ : “మహేష్ బాబు – రాజమౌళి” కలిసి అంతకుముందే సినిమా చేశారా..? అది ఏంటో తెలుసా..?
End of Article