Ads
రాజస్థాన్‌లోని అల్వార్ కు చెందిన అంజు పాకిస్తాన్ చేరుకుని, ఫాతిమాగా మారి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ వెళ్ళి, మతం మార్చుకుని పేరును మార్చుకుని తన లవర్ నస్రుల్లాను వివాహం చేసుకుంది. రెండు దేశాల్లోను ఈ సంఘటన సంచలనంగా మారింది.
Video Advertisement
ఫాతిమా, నస్రుల్లా పెళ్లి చేసుకోవడంతో వారికి కుటుంబం, బంధువుల బహుమతులు ఇవ్వగా, ప్రస్తుతం పాకిస్తాన్ లోని పెద్ద కంపెనీలు సైతం ఆమెకు బహుమతులు ఇవ్వడానికి అంజు ఇంటికి వెళ్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ పెద్ద బిజినెస్ మెన్ కూడా ఈ జంటకు విలువైన ప్లాట్‌ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంజుకు పాకిస్తాన్ కి చెందిన నస్రుల్లాతో ఫేస్ బుక్ లో పరిచయం కావడం, ఆ తరువాత అది ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో లవర్ ను కలుసుకోవడం కోసం అంజు దేశ సరిహద్దులను దాటి పాకిస్తాన్ కు వెళ్లింది. అక్కడ ఇస్లాం మతంలోకి మారి, పేరు సైతం ఫాతిమా మార్చుకుని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మరో వారి పెళ్లి విషయం తెలిసిన అంజు ఆమె భర్త వారి పెళ్లి చెల్లదని చెబుతున్నారు. కానీ ఫాతిమా గా మారిన అంజు మాత్రం ఇక్కడి సంప్రదాయాలను మర్చిపోయి, అక్కడి వాటిని నేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ఫాతిమా, నస్రుల్లా పెళ్లి చేసుకోవడంతో బంధువులే కాకుండా అక్కడి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా వారి ఇంటికి వెళ్ళి మరి బహుమతులు ఇస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ బిజినెస్ మెన్ మహమ్మద్ ఖాన్ అబ్బాసీ అంజుకి బహుమతుల అందచేశారు. ఆమెకు ఇల్లు కట్టుకోవడం కోసం స్థలం మరియు డబ్బును కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఇతర మతాల నుండి తమ మతంలోకి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. ప్రస్తుతం అతను చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
Anju received 10 Marla housing land,cheque of 50K, & other Gifts, given by Islamabad Based businessman & CEO of Pak Star Group of Companies Mohsin Khan Abbasi. CEO PSG said that, #Anju has converted to Islam and married Nasrullah,so we are welcoming her. #AnjuNasrullahLoveStory pic.twitter.com/22j5CWM9LC
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) July 29, 2023
Also Read: “నాన్న వచ్చాడు..!” అని సంతోషంగా చెప్పింది… కానీ చివరికి..? వెలుగులోకి వచ్చిన వింత సంఘటన..!
End of Article