Ads
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మొత్సవం వంటి రిమార్కబుల్ చిత్రాలను తీసిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. కానీ బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ తో సినీ పరిశ్రమకు దూరమై మళ్లీ ఒక్కసారిగా అదే దూకుడుతో మళ్లీ ముందుకొచ్చారు.
Video Advertisement
అలా నారప్పతో ఒక మోస్తరుగా చీకటి నుండి బయట పడ్డారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ తో పెద కాపు సినిమా తెరకెక్కించినున్నారు శ్రీకాంత్ అడ్డాల. పూర్వం గోదావరి జిల్లాల్లో ఉండే రాజకీయాలను ఉద్దేశిస్తూ సాగే పిరియాడిక్ కథతో…ఈ సినిమాను చాలా మాస్ గా, బోల్డ్ గా తీసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ విడుదల అవ్వగా… ప్రేక్షకులు ఈ సినిమాపై ఓ కన్నేసేలా చేశాడు శ్రీకాంత్ అడ్డాల.
కాగా ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నట్లు…దీనికి సుమారు 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాపై నిర్మాత పెట్టిన పెట్టుబడికి బాగా ట్రోల్స్ అవుతున్నాయి. శ్రీకాంత్ అడ్డాలపై నమ్మకంతో ఇంత డబ్బు పెట్టడం ఏంటని కొందరు… అఖండకు వచ్చిన లాభాలు మొత్తాన్ని ఈ సినిమా పైనే పెట్టారా ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో హీరో విరాట్, నిర్మాత రవీందర్ రెడ్డికి దగ్గర బంధువు కావడంతో ఇంత బడ్జెట్ పెట్టాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల కూడా ఓ కీలక పాత్రలో నటించడం విశేషం.
మొత్తానికి ఇంత కష్టపడి కమ్ బ్యాక్ లాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నప్పటికీ… అటు కథలోని సారాంశం కొత్తగా లేకపోవడం కానీ, ఇటు నటీ నటులు పెద్దగా తెలిసిన వారు కాకపోవడం ఈ సినిమాపై అంచనాలను తగ్గిస్తుంది. కానీ శ్రీకాంత్ అడ్డాల పట్టుదల చూస్తుంటే పెద్ద హిట్ కొట్టే అవకాశం ఉందని కూడా కనిపిస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో.
End of Article