Ads
ప్రతివారం ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అయితే వాటిలో ప్రేక్షకులను ఆకట్టుకునేవి మాత్రం కొన్నే ఉంటాయి. ఆసక్తికర చిత్రాలు మాత్రం తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. ఐశ్వర్య రాజేష్ నటించిన ‘సొప్పన సుందరి’ అలాంటి తరహాలో ఉండే సినిమా.
Video Advertisement
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సొప్పన సుందరి అనే డబ్బింగ్ మూవీ మే 12 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. ఏప్రిల్ లో కోలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కమర్షియల్ చిత్రాలలో నటిస్తూనే, మరో వైపు హీరోయిన్ ప్రాధాన్య సినిమాలలో కూడా నటిస్తున్నారు. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన ఐశ్వర్య సొప్పన సుందరి సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, మధ్యతరగతి కుటుంబానికి చెందిన అహల్య (ఐశ్వర్య రాజేష్) ఒక బంగారు షాపులో పని చేస్తుంటుంది. ఆమెకు అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి, నాన్ స్టాప్ గా మాట్లాడే తల్లి, మాటలు రాని అక్క ఉంటారు. అన్నయ్య దొర(కరుణాకరన్) ప్రేమించి, పెళ్లి చేసుకుని వారికి దూరంగా వెళతాడు.
ఆ ఫ్యామిలీకి రోజు గడవడమే చాలా కష్టంగా ఉంటుంది. చాలా అప్పులు ఉండడడంతో కష్టంగా వారి జీవితం సాగుతుంటుంది. అలాంటి వాళ్ళకు ఒకరోజు హఠాత్తుగా ప్రముఖ నగల స్టోర్ లో తీసిన బంపర్ డ్రాలో పది లక్షలు విలువ చేసే కారు వస్తుంది. ఆ తరువాత వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? వారి జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులు ఎవరు? దొర అతని బావ కలిసి ఏం చేశారు? చివరకు ఏం అయ్యింది? అనేది మిగతా కథ.
అహల్యగా నటించిన ఐశ్వర్య రాజేష్ పాత్రలో ఒదిగిపోయింది. మూవీ మొదలైనప్పటి నుండి ముగిసేవరకు డిఫరెంట్ వేరియేషన్స్ తో ఆకట్టుకుంది. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం, థ్రిల్ కు గురి చేస్తూ కామెడీ పండించే విషయంలో దర్శకుడు విజయం సాధించాడు. ఈ మూవీ చూసినంతసేపు ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు.
End of Article