Ads
సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం జైలర్. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమాకి భాషతో సంబంధం లేకుండా తొలిరోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలోని ‘కావాలయ్యా’ సాంగ్ హిట్ కావడం, మూవీ ట్రైలర్ బాగుండటంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Video Advertisement
ఇక మొదటి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో రజనీ కాంత్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ తండ్రి పాత్రలో నటించారు. అయితే ఆయన కుమారుడి పాత్రలో నటించిన నటుడు ఎవరో? ఇప్పుడు చూద్దాం..
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జైలర్ మూవీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో రజనీకాంత్ భార్య పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించింది. ఈ మూవీలో కీలకమైన రజిని కాంత్ కొడుకు అర్జున్ పాత్రలో తమిళ హీరో వసంత్ రవి నటించారు. ఈ చిత్రం వసంత్ నటించిన నాలుగవ చిత్రం. ఇటీవల రిలీజ్ అయిన తమిళ డబ్బింగ్ మూవీ అశ్విన్స్ లో హీరోగా వసంత్ రవి నటించారు. వసంత్ రవి అసలు పేరు వసంత్ కుమార్ రవి. ఇతను హీరో మాత్రమే కాదు డాక్టర్ కూడా. చెన్నై లో ఫేమస్ రెస్టారెంట్ అయిన ‘నమ్మ వీడు వసంత భవన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్’ చైర్మన్ రవి ముత్తుకృష్ణన్ కుమారుడు వసంత్ రవి. 2017లో మొదటిసారి అతను ‘తారామణి’ అనే చిత్రంలో నటించాడు. ఆ మూవీ హిట్ అయ్యింది. ఆ మూవీలోని నటనకు గాను వసంత్ ఉత్తమ నటుడుగా విజయ్ అవార్డ్ మరియు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ను అందుకున్నాడు. అతను నటించిన రెండవ సినిమా ‘రాకీ’ ఈ మూవీకి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. ఆ తరువాత హర్రర్ మూవీ ‘అశ్విన్స్’ లో హీరోగా నటించిన వసంత్ ‘జైలర్’ మూవీలో అర్జున్ అనే ఏసీపీ పాత్రలో మెప్పించారు.
https://www.instagram.com/p/Cvw2j3hyyRX/?hl=te
Also Read: BHOLAA SHANKAR REVIEW : “చిరంజీవి” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article