Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, తమిళ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ ఎవరి ఇండస్ట్రీలో వారు దిగ్గజాలుగా గుర్తింపు పొందిన నటులు. ఇండస్ట్రీలు వేరు అయినా కూడా వీరి మధ్య స్నేహం ఎన్నో సంవత్సరాల నుండి కొనసాగుతోంది.
Video Advertisement
చాలా ఈవెంట్స్ లో కలిసినప్పుడు ఆత్మీయంగా పలకరించుకుంటున్న వీడియోలు, ఫోటోలు మనం చూస్తూనే ఉంటాం. అలాగే ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా చెప్పుకున్నారు.
నిజంగానే బయట అభిమానులు గొడవలు పడతారు ఏమో కానీ హీరోలు మాత్రం చాలా స్నేహంగా ఉంటారు అని వీరిని చూస్తే అర్థం అవుతోంది. మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు చాలా మంది హీరోలు సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించారు. అందుకు కారణం వారి మధ్య ఉన్న స్నేహం. అలా చిరంజీవి కూడా రజనీకాంత్ నటించిన ఒక సినిమాలో అతిధి పాత్రలో నటించారు. 1989 లో విడుదల అయిన మాపిళ్ళై అనే ఒక తమిళ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించారు. ఈ సినిమాకి రాజశేఖర్ దర్శకత్వం వహించారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి కూడా ఒక చిన్న పాత్రలో నటించారు. క్లైమాక్స్ లో వచ్చే ఒక ఫైటింగ్ సీన్ లో చిరంజీవి కనిపిస్తారు. అందులో హీరోకి సహాయపడతారు. ఆ తర్వాత రజినీకాంత్ చిరంజీవిని తన కుటుంబ సభ్యులతో, “ఇతను చిరంజీవి. నా బెస్ట్ ఫ్రెండ్” అని చెప్పి పరిచయం కూడా చేస్తారు. ఇది మాత్రమే కాకుండా వీరిద్దరూ కలిసి రణువ వీరన్, బందిపోటు సింహం, కాళీ అనే సినిమాల్లో కూడా కలిసి నటించారు.
ఇప్పుడు వీరిద్దరూ జైలర్, భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. జైలర్ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి నెల్సన్ దర్శకత్వం వహించారు. వేదాళం సినిమా రీమేక్ అయిన భోళా శంకర్ కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం రెండు సినిమాలు థియేటర్లలో నడుస్తున్నాయి.
watch video :
ALSO READ : “భోళా” రిజల్ట్ ఎఫెక్ట్ “వరల్డ్ కప్” మీద పడుతుందా..? ఎలా అంటే..?
End of Article