Ads
బయోపిక్ కథలతో తీసే సినిమాలు లేదా వెబ్ సిరీస్ పైన ఆడియెన్స్ ఎక్కువ ఆసక్తిని కనపరుస్తారు. అందువల్ల దర్శక, నిర్మాతలు సినిమాలు మాత్రమే కాకుండా బయోపిక్ గా వెబ్‌సిరీస్‌లను కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడిన శ్రీగౌరి సావంత్ కథ ఆధారంగా ‘తాలీ’ అనే వెబ్ సిరీస్ ను తీశారు.
Video Advertisement
ఈ సిరీస్ కు రవి జాదవ్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ లీడ్ రోల్ లో నటించారు. ఈ వెబ్‌సిరీస్ తాజాగా ‘జియో సినిమా’ లో రిలీజ్ అయ్యింది. ఈ వెబ్‌సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ ట్రాన్స్‌జెండర్‌గా నటించిన ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లుగా రూపొందింది.ఈ సిరీస్ కథలోకి వెళ్తే, గణేశ్ (కృతిక) ఒక పోలీసు ఆఫీసర్ కుమారుడు. అతనికి చిన్నప్పటి నుండే అమ్మాయిగా మారాలనె కోరిక ఉంటుంది. స్కూల్లో టీచర్ పెద్దగా అయిన తరువాత ఏమవుతావ్?’ అని అడిగితే అమ్మను అవుతానని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఈ విషయాన్ని గణేశ్ చెప్పకుండానే ఇంట్లో వారికి అర్థమవుతుంది. ఆ తరువాత గణేష్ తల్లి చనిపోతుంది.అప్పుడు తండ్రి గణేష్ తో నీ నిర్ణయాన్ని మార్చుకుంటేనే ఇంట్లో ఉండమని లేదంటే బయటికి వెళ్ళమని చెబుతాడు. 15 సంవత్సరాల వయసులో గణేశ్ ఇంట్లోంచి బయటకు వచ్చి, సర్జరీ ద్వారా అమ్మాయిగా మారి, గౌరి (సుస్మితా సేన్) గా పేరు మార్చుకుంటాడు. అమ్మ కావలనే తన కోరికను గౌరి నెరవేర్చుకుందా? ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు తీసుకురావడానికి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది? అనేది మిగతా కథ.సుస్మితా సేన్ నటన ఇలాంటి క్యారెక్టర్ ను అంగీకరించడమే సాహసం అనుకుంటే ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు. అనేది. ఆమె ట్రాన్స్‌జెండర్ పాత్రలో జీవించింది. గణేశ్ పాత్రలో కృతిక డియో, తండ్రి పాత్రలో నందు యాదవ్, మిగతా నటీనటులు కూడ బాగా నటించారు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. విజువల్స్, రవి జాదవ్ టేకింగ్ బాగుంది.
End of Article