Ads
దర్శక దిగ్గజం కళాతపస్వి కె. విశ్వనాథ్ ఎన్నో అద్భుతమైన క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాంటి వాటిలో స్వర్ణకమలం మూవీ కూడా ఒకటి. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, భానుప్రియ హీరోహీరోయిన్లుగా నటించారు. 1988లో రిలీజ్ అయిన ఈ మూవీ ఘనవిజయాన్ని సాధించింది.
Video Advertisement
సోషల్ మీడియాలో నెటిజెన్లు పాత సినిమాలకు సంబంధించిన ఫోటోలు, పాటలు, వీడియోలను షేర్ చేస్తూ, అప్పట్లో గ్రహించని, గమనించని విషయాలను కూడా వైరల్ చేస్తున్నారు. వీటి పై నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్వర్ణ కమలం సినిమాలో సన్నివేశాలను షేర్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కళాతపస్వి కె విశ్వనాధ్ మూవీ అంటేనే, దానికో ప్రత్యేకత ఉంటుంది. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో సంగీత, నృత్య, సాహిత్య, కళాత్మక విలువల గురించి అద్భుతంగా చూపిస్తుంటారు. అదేకోవలో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా స్వర్ణ కమలం. ఈ మూవీ అప్పట్లో బంపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్, భానుప్రియ జంటగా నటించగా కీలక పాత్రలలో చాలామంది నటీనటులు కనిపించారు.
కళ అనేది జన్మ జన్మల పుణ్యం వల్లే వస్తుందని గ్రహించలేని వేదపండితుడి కూతురు కథే ఈ మూవీ. సమాజం వేగంగా మారుతోంది. దానితో పాటే మనమూ వెళ్లాలి. సంప్రదాయ కళలనే నమ్ముకుని బావిలో కప్పల బతకడం ఏమిటి అనుకునే మీనాక్షి పాత్రలో భానుప్రియ అద్భుతంగా నటించింది. మూవీ ప్రారంభంలో తండ్రి నేర్పించిన కూచిపూడి నాట్యం కడుపు నింపదనే భావనతో అయిష్టత ప్రదర్శస్తుంటుంది. ఆ సమయంలో ఆమె తయారయ్యే విధానం కూడా గందరగోళంగా ఉంటుంది.
కానీ ఆమెలో మార్పు వచ్చిన తరువాత ఆమె తయారయ్యే విధానంలో మార్పును చూపిస్తూ, దర్శకుడు ఆ విషయాన్ని స్పష్టంగా ఆ సన్నివేశంలో చూపించారు. అప్పటి ప్రేక్షకులు ఈ విషయాన్ని ఎంతవరకు గ్రహించారో లేదో కానీ, ఒక మూవీ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వివరించారు. ఆ ఇంటర్వ్యూ కు ఈ రెండు సీన్స్ ను కలిపి చందమామ కథలు అనే ఇన్ స్టా పేజీలో షేర్ చేస్తూ, అసలు పాత సినిమాలలోనే చాలా కొత్త విషయాలు ఉన్నాయి. కానీ మనం గ్రహించలేదు అంటూ రాసుకొచ్చారు.
https://www.instagram.com/reel/CuvvCOXpBgh/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: PREM KUMAR REVIEW : “సంతోష్ శోభన్” ఈ సినిమాతో హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article