Ads
ఈ మధ్య టాలీవుడ్లో రీ-రిలీజ్‌ల హవా నడుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోల బర్త్‌డే, స్పెషల్ డే ల సందర్భంగా వాళ్ళ పాత సినిమాలను 4K ప్రింట్‌తో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్‌బాబు ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాలు వాళ్ళ బర్త్‌డే సందర్భంగా విడుదలై రికార్డు కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.
Video Advertisement
మరో వైపు చెన్న కేశవరెడ్డి విడుదలై 20 ఏళ్ళు అయిన సందర్భంగా ఆ చిత్రం కూడా రీ రిలీజ్ అయింది. అయితే ప్రభాస్ బర్త్ డే కి మాత్రం సూపర్ హిట్ సినిమాలైన వర్షం, బిల్లా సినిమా లతో పాటు రెబెల్ చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలే. సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ద్వారా మంచి పాపులారిటీని, మరింతగా వసూళ్లని సొంతం చేసుకుంటున్నారు.
రెబెల్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన విషయం తెల్సిందే.. కారణాలేవైనా రెబెల్ సినిమా రీ రిలీజ్ చేయనున్న నేపథ్యం లో తమ అభిమాన హీరోల ఫ్లాప్ మూవీస్ కూడా రీ రిలీజ్ చెయ్యాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ లిస్ట్ లో ఏ మూవీస్ ఉన్నాయో చూడండి..
#1 చిరంజీవి – బిగ్ బాస్
విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో చిరంజీవి సరసన రోజా కథానాయికగా నటించింది.
#2 పవన్ కళ్యాణ్ – అజ్ఞాతవాసి
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 2018లో విడుదలైన సినిమా. ఇందులో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.
#3 నాగార్జున – భాయ్
యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం లో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ్ నటించింది.
#4 వెంకటేష్ – సుభాష్ చంద్ర బోస్
హిస్టారికల్ డ్రామా గా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ చిత్రం లో వెంకటేష్ సరసన శ్రేయ, జెనీలియా నటించారు.
#5 నాని – వి
క్రైమ్ సస్పెన్సు థ్రిల్లర్ అయిన ఈ చిత్రం లో నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరీ ముఖ్య పాత్రల్లో నటించారు.
#6 బాలకృష్ణ – పరమ వీర చక్ర
దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఇది 150 వ చిత్రం. నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించాడు
#7 మహేష్ బాబు – బ్రహ్మోత్సవం
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ కుటుంబ కథ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
#8 ఎన్టీఆర్ – శక్తి
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్ర దర్శకుడు మెహెర్ రమేష్. నిర్మాత అశ్వనీదత్ సొంత పతాకం వైజయంతీ మూవీస్ లో జూనియర్ ఎన్.టి.ఆర్, ఇలియానా నాయకా నాయికలుగా నటించారు.
#9 అల్లు అర్జున్ – వరుడు
దర్శకుడిగా గుణశేఖర్ పదవ చిత్రం. ఈ చిత్రంలో అల్లు అర్జున్, తమిళ నటుడు ఆర్య, భాను శ్రీ మెహ్రా ప్రధాన పాత్రల్లో నటించగా, సుహాసిని మణిరత్నం, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం సహాయక పాత్రలు పోషించారు.
#10 రామ్ చరణ్ – తూఫాన్
హిందీ, తెలుగు లో ఒకేసారి చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలైన ఈ చిత్రం లో ప్రియాంక చోప్రా రామ్ చరణ్ సరసన నటించింది.
#11 ప్రభాస్-సాహో
ప్రభాస్ హీరోగా నటించిన సాహో భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి ఫ్లాప్ అయ్యింది. కానీ ఏదేమైనా ఈ సినిమాకి టాక్ మాత్రం బాగుంది అని అన్నారు. కాబట్టి సినిమా ఒకవేళ ఇప్పుడు విడుదల చేస్తే హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది.
#12 మంచు విష్ణు – సలీం
వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో మంచు విష్ణు, ఇలియానా జోడీగా నటించారు.
End of Article