Ads
‘గుప్పెడంత మనసు’ సీరియల్ కి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కొంతకాలం క్రితం వరకు టీఆర్పీ రేటింగ్ లో టాప్ ప్లేస్ లో కొనసాగింది. బుల్లితెర ప్రేక్షకులను రిషి, వసుధార ప్రేమ కథ ఎంత ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.
Video Advertisement
ఈ సీరియల్ లో హీరో తల్లి జగతికి ఆమె కుమారుడు రిషి మధ్య వచ్చే సెంటిమెంటు సీన్స్ కూడా అదే స్థాయిలో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జగతి కట్టు, బొట్టుకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో జగతి ఫోటోలను చూసిన నెటిజెన్లు మీమ్స్, ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గుప్పెడంత మనసు సీరియల్ కు ఎంత పాపులారిటి ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సీరియల్ లో హీరోహీరోయిన్ల క్యారక్టర్ల తరువాత ఎక్కువ పేరు, గుర్తింపు వచ్చిన పాత్ర జగతి. ఆ పాత్ర యొక్క కట్టు, బొట్టుకి ఆమెకు ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాత్రను పోషించిన నటి పేరు జ్యోతి రాయ్. అయితే సీరియల్ అంత ట్రెడిషనల్ గా ఉండే జ్యోతి సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలతో, వీడియోలతో హల్చల్ చేస్తోంది. ఆమె ఫోటోలు షేర్ చేసిన కాసేపటికే వైరల్ గా మారుతుంటాయి.
జ్యోతి రాయ్ వయసు 38 ఏళ్లు. ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల జ్యోతి తన భర్తకి డైవర్స్ ఇచ్చిందని, యువ దర్శకుడిని రెండవ వివాహం చేసుకుందని కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే వీటి పై జ్యోతి రాయ్ ఘాటుగా స్పందించింది. “మీకు అర్థంకాని విషయం పై విమర్శలు చేయకండి. ఎప్పటికీ మీరు నా లైఫ్ లోకి వచ్చి చూడలేరు, గుర్తుపెట్టుకోండి” అని సోషల్ మీడియాలో కామెంట్ చేసింది.
ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉండే జ్యోతి రాయ్ ఇటీవల వరుసగా తన గ్లామరస్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తోంది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజెన్లు, జ్యోతి రాయ్ పై మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. ‘హీరోయిన్ అవ్వాల్సిన క్యారెక్టర్ ని సీరియల్ లో తల్లి పాత్ర చేసారు కదా రా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CvES2crsUBb/
Also Read: అప్పుడు “విక్రమ్” కి కూతురుగా నటించింది… తర్వాత విక్రమ్ కి క్రష్ గా…? ఈమెని గుర్తుపట్టారా ..?
End of Article