బలమైన కథ, గ్రాండ్ విజువల్స్‌, భారీ హంగులతో సినిమాను రూపొందిస్తే భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఆదరిస్తారని ‘బాహుబలి’తో రుజువైంది. ఈ సినిమాతో ఎస్.ఎస్.రాజమౌళి పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ సక్సెస్ కావడంతో చాలా మంది ఫిల్మ్ మేకర్స్‌కి తమ కలల ప్రాజెక్ట్‌లు తెరకెక్కించడానికి ధైర్యం వచ్చింది.

Video Advertisement

అలాంటి ఒక ధైర్యంతోనే దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను వెండితెరపై ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవలను తెరకెక్కించాలని 4 దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావించిన మణిరత్నం.. మొదటి భాగం ‘పొన్నియిన్ సెల్వన్: 1’ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

తమిళ్‌ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక కాలంలో సెప్టెంబర్ 30ని ఈరోజు విడుదల చేశారు. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌ రాజ్‌ వంటి భారీ తారాగణం నటించిన ఈ మూవీకి మొదటి షో నుండే మిశ్రమ స్పందన వచ్చింది.

ఇక ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో విక్రమ్ కూడా అద్భుతంగా నటించారు. విక్రమ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలు చేసి విక్రమ్ మంచి నటుడనిపించుకున్నారు. పైగా నటనంటే చాలా ఇష్టం విక్రమ్ కి. అందుకే భిన్నంగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ఉంటారు. విక్రమ్ తమిళంలో టాప్ హీరోలలో ఒకరు. ప్రేక్షకులు ఈయన నుండి ఏం కోరుకుంటారో అటువంటి పాత్రలనే అతను చేస్తారట. సెట్స్ లో కూడా విక్రమ్ చాలా సరదాగా ఉంటారు.

తెలుగులో వచ్చిన నాన్న చిత్రంలో కూడా విక్రమ్ ఎంతో అద్భుతంగా నటించారు. అయితే ‘నాన్న’ చిత్రం మీకు గుర్తుందా..? అందులో ఒక చిన్న పాప విక్రమ్ కి కూతురు గా నటిస్తుంది. అయితే ఆ పిల్ల ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ సినిమాలో విక్రమ్ కి క్రష్ పాత్ర చేసింది. ఐశ్వర్యా రాయ్ చిన్నప్పటి పాత్ర ఈ అమ్మాయి చేసింది. ఇలా ఆమె నటించడంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున మీమ్స్ వస్తున్నాయి. అప్పుడు విక్రమ్ కి కూతురుగా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ సినిమాలో క్రష్ గా నటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.