Ads
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్, తాజాగా ఈ సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించాడు.
Video Advertisement
69 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమలో మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న తెలుగు హీరోగా నిలిచాడు. ఈక్రమంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బన్నీ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి. బన్నీ సాధించిన విజయాలతో పాటు ఎదుర్కొన్న వివాదాలు కూడా వైరల్ అవుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. దేశముదురు వివాదం:
అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకటవంలో వచ్చిన సినిమా దేశముదురు. ఈ మూవీ ద్వారా హన్సిక హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. డి.వి.వి. దానయ్య ఈ సినిమాను నిర్మించారు. అయితే పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వలేదని విషయం వివాదాస్పదం అయ్యింది.
2. దువ్వాడ జగన్నాధం వివాదం:
అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాధం మూవీ 2017లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ బ్రహ్మణ యువకుడి పాత్రలో అల్లు అర్జున్ నటించారు. అయితే బన్నీ పై బ్రహ్మణుల అగౌరపరిచారని విమర్శలు వచ్చాయి.
3. అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ వివాదం:
ఒక పబ్లిక్ ఈవెంట్ లో అల్లు అర్జున్ “చెప్పను బ్రదర్” అంటూ మాట్లాడారు. ఈ మాటలు పవన్ కళ్యాణ్ అగౌరవపరిచేలా ఉండడంతో ఈ విషయం వివాదంగా మారింది.
4. సరైనోడు వివాదం:
అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ పై కాపీ రైట్ ఉల్లంఘనల ఆరోపణలు వచ్చాయి.
5. అల్లు అర్జున్ – భానుశ్రీ మెహ్రా వివాదం:
అల్లు అర్జున్, భానుశ్రీ మెహ్రా వరుడు మూవీలో జంటగా నటించారు. అయితే అల్లు అర్జున్ ఆమెను ట్విట్టర్‌లో బ్లాక్
చేశారు. దాంతో ఆ విషయాన్ని భానుశ్రీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాంట్రవర్సీ గా మారింది.
4. రాపిడో యాడ్ వివాదం:
గత ఏడాది అల్లు అర్జున్ నటించిన రాపిడో యాడ్ విషయంలో వివాదం జరిగింది. ఆర్టీసిని కించపరిచేలా ఈ యాడ్ ఉందని ఆర్టీసి ఛైర్మెన్ సజ్జనార్ అల్లు అర్జున్ కు, రాపిడో సంస్థకి లీగల్ నోటీసులు పంపించాడు.
5. జొమాటో యాడ్ వివాదం:
అల్లు అర్జున్ నటించిన జొమాటో యాడ్ కూడా విమర్శలకు కారణమైంది. ఈ యాడ్ లో పుష్ప మూవీ మేనరిజమ్ చూపిస్తూ బన్నీ చెప్పిన డైలాగ్, సౌత్ సినిమాలను కించపరిచేలా ఉందని అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
6. విద్యా సంస్థ యాడ్ వివాదం:
ఒక విద్యా సంస్థ సంబంధించిన యాడ్ లో అల్లు అర్జున్ నటించాడు. కానీ ఈ యాడ్ తప్పుదోవ పట్టించేలా ఉందని,
అల్లు అర్జున్ మీద, ఆ విద్యాసంస్థ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైట్ చేశారు.
Also Read: “ఖుషి” ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?
End of Article