యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఖుషి’. ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని వై.రవి శంకర్, నవీన్ ఎర్నేని సంయుక్తంగా  నిర్మించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతంలో వచ్చిన ఈ మూవీ సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి.

Video Advertisement

ఇటీవల కాలంలో ఏ తెలుగు మూవీకి రానంత బజ్ ఖుషి సినిమాకు వచ్చింది. సెప్టెంబర్ 1న  తెలుగు, తమిళ,  కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఖుషి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
khushi-movieవిజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఖుషి టీజర్, పాటలు,ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి మంచి స్పందన లభించింది. విజయ్, సమంతల మధ్య వచ్చే సీన్స్ యూత్ తో పాటు  కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని టీజర్, ట్రైలర్ల చూస్తే తెలుస్తోంది. మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉంది.  అయితే ఈ మూవీ మొదటి రివ్యూ వచ్చేసింది. అది ఇచ్చింది ఎవరో కాదు. ఓవర్సీస్ సెన్సార్ మెంబర్ గా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో రివ్యూలు పెట్టె ఉమైర్ సంధు. తాజాగా ‘ఖుషి’ సినిమా చూసినట్టుగా చెప్పిన ఉమైర్ సంధు, ఈ మూవీ రివ్యూను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్ లో “అవుట్ డేటెడ్ మరియు బోరింగ్ లవ్ స్టోరీ.విజయ్ దేవరకొండ సమంతల మధ్య కెమిస్ట్రీ పండలేదు. ఈ సినిమాలో సమంత వయసు మీద పడినట్టుగా కనిపిస్తోంది. సాగదీసిన  కథాంశం, డల్ స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వం, కథ చాలా వీక్ గా ఉందని, ఈ మూవీకి వెళ్లకుండా మీ డబ్బులు ఆదా చేసుకోండి” అని ఉమైర్ సంధు పేర్కొన్నాడు. ఫైనల్ గా ఈ మూవీకి రేటింగ్ 5 కి గాను 2 ఇస్తున్నట్టు ఆ ట్వీట్ ద్వారా వెల్లడించాడు.

Also Read: OG కొత్త పోస్ట‌ర్‌లో… “ప‌వ‌న్ క‌ళ్యాణ్” చేతికి ఉన్న‌ టాటూ అర్థం ఏంటో తెలుసా..?