OG కొత్త పోస్ట‌ర్‌లో… “ప‌వ‌న్ క‌ళ్యాణ్” చేతికి ఉన్న‌ టాటూ అర్థం ఏంటో తెలుసా..?

OG కొత్త పోస్ట‌ర్‌లో… “ప‌వ‌న్ క‌ళ్యాణ్” చేతికి ఉన్న‌ టాటూ అర్థం ఏంటో తెలుసా..?

by kavitha

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై ఆడియెన్స్ లో, ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇప్పటి వరకూ రిలీజ్ చేయలేదు. తాజాగా ఈ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ చేతి పై ఉన్న టాటూకి అర్ధం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘బ్రో’ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా  నటించగా, పవన్ కళ్యాణ్ టైమ్ దేవుడు టైటాన్ పాత్రలో నటించి, మెప్పించారు. ఈ పాత్ర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలలో ‘ఓజీ’ ఒకటి. ఈ చిత్రానికి ప్రభాస్ తో ‘సాహో’ లాంటి భారీ బడ్జెట్ సినిమాని తీసిన దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుజీత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే.
ఈ సినిమాని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ‘ఓజీ’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న ఈ మూవీ గ్లింప్స్ లేదా టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఫస్ట్ లుక్ లేదు అంటూ ఆకలితో ఉన్న చిరుత కోసం వెయిట్ చేద్దాం అని ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో గన్ పట్టుకున్న చేతి పై ఒక టాటూ కనిపిస్తోంది. దీంతో ఆ టాటూ అర్ధం ఏమిటా అని నెటిజెన్లు సెర్చ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ టాటూకు అర్ధం ఫైర్ పవర్ అని ఒక ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ బర్త్ డే రోజు టీజర్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

Also Read: ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి తండ్రి ఈ జనరేషన్ లోనే పెద్ద హీరో..! ఎవరో తెలుసా..?


End of Article

You may also like