ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి తండ్రి ఈ జనరేషన్ లోనే పెద్ద హీరో..! ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి తండ్రి ఈ జనరేషన్ లోనే పెద్ద హీరో..! ఎవరో తెలుసా..?

by kavitha

Ads

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది ఎప్పటి నుండో కొనసాగుతూ వస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరో వారసులు హీరోగా అడుగుపెట్టడం కోసం ఆ హీరో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. సాధారణంగా హీరోల కొడుకులు హీరోలుగానే ఎంట్రీ ఇస్తుంటారు.

Video Advertisement

అయితే కొందరు వారసులు మాత్రమే అందరు వెళ్ళే దారిలో కాకుండా కొత్త దారిలో ప్రయాణించాలనుకుంటారు. అలాంటి జాబితాలో తాజాగా ఒక స్టార్ హీరో కుమారుడు చేరిపోయారు. తండ్రిలా హీరోగా కాకుండా, దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి ఆ స్టార్ హీరో ఎవరో? ఇప్పుడు చూద్దాం..
పై ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు జాసన్ సంజయ్. ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ అయిన లైకా ప్రొడక్షన్స్ ద్వారా జాసన్ సంజయ్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయబోతున్నాడు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై త్వరలో నిర్మించబోయే కొత్త చిత్రానికి జాసన్ సంజయ్ దర్శకత్వం వహించబోతున్నారని లైకా సంస్థ అధినేత అయిన సుభాస్కరన్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ జరిగినట్లు వెల్లడిస్తూ, ఫోటోలను కూడా  సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ విషయం తెలిసిన అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. అంత పెద్ద స్టార్ హీరో తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడని అనుకుంటే, దర్శకుడిగా మారబోతున్నారా అని జాసన్ సంజయ్ అనూహ్య నిర్ణయం పట్ల షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఈ విషయం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతలా చర్చకు దారితీయడానికి కారణం జాసన్ సంజయ్ స్టార్ హీరో తనయుడు కావడమే. ఆయనెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి. సౌత్ ఇండస్ట్రీలో ఆయనకుండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్ సినిమాల కోసం అటు కోలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లోను ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది మొదట్లోనే వారసుడు మూవీతో విజయం అందుకున్నవిజయ్ దళపతి, ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఇక హీరో విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ అనే విషయం తెలిసిందే. జాసన్ సంజయ్ తాత మార్గంలో దర్శకుడిగా మారబోతున్నారు.
 
Also Read: నాగార్జున సినిమాల్లోకి వచ్చేముందు.. అభిమానులకు ఏఎన్నార్ రాసిన ఈ లేఖ గురించి తెలుసా..?


End of Article

You may also like