Ads
ఇటీవల కాలంలో తిరుమల నడకదారిలో చిన్నారి పై చిరుత దాడి చేసిన సంఘటన భక్తులని ఒక్కసారిగా ఉలుక్కిపడేలా చేసింది. ఈ సంఘటనలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. అంతకుమందు నెలలో చిరుత ఒక బాలుడి పై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు.
Video Advertisement
ఆ బాలుడు తిరుపతిలోని చిల్డ్రన్స్ హాస్పటల్ లో చికిత్స తర్వాత కోలుకున్నాడు. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత ఇంటికి వెళ్లాడు. ఈ సంఘటనలు తిరుమలలో 7వ కిలో మీటర్ ప్రాంతంలో జరిగింది. అయితే 7వ కిలో మీటర్ ప్రాంతం వద్ద 1980లో ఒక సంఘటన జరిగిందట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తిరుమలలో 7వ కిలో మీటర్ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. చర్చలకు దారితీస్తోంది. దానికి కారణం తిరుమల నడకదారిలో చిన్నారులపై చిరుత పులి దాడి చేయడం. రెండు సంఘటనలు జులై, ఆగస్ట్ నెలలో జరిగాయి. మొదటి సంఘటనలో జులై 23న బాలుడు కౌశిక్ చిరుత దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడి అరుపులకు భక్తులు వెళ్లడంతో చిరుత విడిచిపెట్టి వెళ్ళింది. ఆ బాలుడు చికిత్స తీసుకున్న తరువాత కోలుకున్నాడు.ఇదే ప్రాంతంలో ఆ తరువాత ఆగస్ట్ 11న కుటుంబంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన చిన్నారి లక్షిత చిరుత దాడి చేయగా ప్రాణాలు కోల్పోయింది. ఆ తరువాత ఫారెస్ట్ అధికారులు చిరుతలను బంధించారు. టీటిడి అధికారులు దర్శనంలో కోసం నడకదారిలో వచ్చే భక్తుల భద్రత కోసం తగు చర్యలు చేపట్టారు. ఇక ఇదే ప్రాంతంలో 1980లో దారుణమైన సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.తిరుమలలోని ఘాట్ రోడ్ 7 వ కిలోమీటర్ వద్ద ఒక మహిళను దారుణంగా హత్య చేశారట. ఆ మహిళ హత్య వల్ల కలిగే నష్ట నివారణ కోసం అక్కడ ఒక ఆంజనేయ విగ్రహాన్ని స్థాపించారు అప్పటి ఈవో పీవోఆర్కే ప్రసాద్. అప్పుడు మహిళా హత్య, ఇప్పుడు చిరుతపులి దాడి రెండు కూడా ఇదే 7వ కిలో మీటర్ సమీపంలోనే జరిగాయి.
https://www.instagram.com/p/CwZB52xtYV8/
Also Read: శ్రావణమాసంలో “నాన్ వెజ్” తినొద్దు అంటారు.? ఎందుకని..? వెనకున్న 3 కారణాలు ఇవే..!
End of Article