Ads
గరుడ గమన వృషభ వాహన మూవీతో గుర్తింపు పొందిన కన్నడ నటుడు రాజ్ బి శెట్టి. ఈ మూవీలో రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు. రాజ్ బి శెట్టినేఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 2021లో నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఆడియెన్స్ ప్రశంసలను అందుకుంది.
Video Advertisement
రాజ్ బి శెట్టి ఈమూవీ కన్నా ముందుగా ‘ఒందు మొట్టేయ కథె’ అనే సినిమాలో ప్రధానపాత్రలో నటించాడు. తొలిసారి ఈ చిత్రంలోనే లీడ్ రోల్ లో నటించారు. ఈ మూవీకి డైరెక్టర్ మరియు రచయితగా చేశారు. మరి ఒందు మొట్టేయ కథె మూవీ స్టోరీ ఏమిటో? ఇప్పుడు చూద్దాం..
రాజ్ బి శెట్టి కన్నడ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్ గా రాణిస్తున్నారు. ఆయన యాక్టర్ మాత్రమే కాదు దర్శకుడు మరియు రచయిత. పలు కన్నడ చిత్రాలకు దర్శకుడిగా, రచయితగా పనిచేశారు. ఈ ఏడాది టోబి అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించి, మెప్పించారు. గరుడ గమన వృషభ వాహన సినిమాతో పాపులర్ అయిన రాజ్ బి శెట్టి మొదటిసారి లీడ్ క్యారెక్టర్ పోషించిన మూవీ ‘ఒందు మొట్టేయ కథె’. 2017 లో రిలీజ్ అయిన ఈ మూవీ 30 లక్షలు బడ్జెట్ తో తెరకెక్కి, రూ. 2.5 కోట్లు కలెక్షన్స్ సాధించి కమర్షియల్‌గా విజయం సాధించింది. ఉత్తమ సినిమాగా అవార్డ్ అందుకుంది.
రొమాంటిక్ కామెడీమూవీగా తెరక్కేకిన ఈ మూవీ కథ విషయానికి వస్తే, 28 ఏళ్ల జనార్ధన్( రాజ్ బి శెట్టి) వృత్తిరీత్యా కన్నడ లెక్చరర్. బట్టతల మరియు సన్నగా ఉండడంవల్ల పెళ్లి సంబంధాలనని తప్పిపోతుంటాయి. జనార్ధన్ జాతకం ప్రకారం, 29 ఏళ్లలోపు అంటే ఏడాది లోపు వివాహం కాకపోతే, అతడు సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని జ్యోతిష్యుడు హెచ్చరిస్తాడు. దాంతో జనార్ధన్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటాడు.
ఆ క్రమంలో సహోద్యోగి అయిన ఎకనామిక్స్ లెక్చరర్ ను లవ్ లో పడేయడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతాడు.
ఆ తరువాత ఫేస్ బుక్ ద్వారా తన స్కూల్ క్లాస్ మేట్ ప్రేమ కోసం ప్రయత్నిస్తాడు. అయితే వారిద్దరూ ఒక రోజు పార్కులో కలుస్తారు. కానీ జనార్థన్ సరళ లావుగా ఉందని అసహ్యించుకుంటాడు. అతనిలాగే సరళ కూడా బట్టతలను చూసి ఇష్టష్టపడదు.
అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల సరళ జనార్థన్ ని లవ్ చేస్తుంది. జానార్థన్‌కు నచ్చకపోయినా సరళతో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. కానీ అందమైన అమ్మాయినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న జనార్థన్ లావుగా ఉన్న సరళను పెళ్లి చేసుకున్నాడా? లేదంటే ఆమెతో పెళ్లి రద్దు చేసుకొని అందంగా ఉండే అమ్మాయి కోసం వెతకడం మొదలుపెడతాడా? అనేది మిగిలిన స్టోరీ.
Also Read: OG గ్లింప్స్ వీడియోలో… “పవన్ కళ్యాణ్” మాట్లాడిన ఆ భాష ఏంటో తెలుసా..? ఆ డైలాగ్ అర్ధం ఏంటంటే..?
End of Article