Ads
సోషల్ మీడియా విస్తరిస్తున్న కొద్ది ఏదన్నా మూవీ లో సాంగ్ లేక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే చిత్రం నుంచి కాపీ కొట్టినట్లు అయితే నెటిజన్స్ సులభంగా కనిపెట్టేస్తున్నారు.
Video Advertisement
ఇంట్రడక్షన్ సింగల్ దగ్గర నుంచి పోస్టర్ అండ్ రిలీజ్ వరకు ప్రతి చిన్న విషయాన్ని గమనించడమే కాకుండా దేనికైనా కాపీ అన్న విషయం ఐడెంటిఫై అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ లిస్టులో టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి తమన్ అని చెప్పవచ్చు.
ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే అభిమానులు పోస్టర్ ,ఫస్ట్ లుక్, ట్యూన్స్ ఇలా అన్నిటిని ఎంతో నిశిత దృష్టితో పరిశీలిస్తున్నారు. యాంటీ హీరో ఫ్యాన్స్ అయితే ఏ సాకు దొరుకుతుందా ఆ హీరోని ట్రోల్ చేద్దామా అని ఎంతో జాగ్రత్తగా వెతుకుతున్నారు. ఒక్కసారి ఎవరన్నా ట్రోల్ చేయడం మొదలుపెడితే అది బాగా కంటిన్యూ అవుతుంది.
తమన్ పై నిజానికి ఇట్లాంటి కాపీ ఆరోపణలు ఈరోజు కొత్త కాదు.. అతను ఇప్పటివరకు కంపోజ్ చేసిన ఎన్నో పాటలు ఎక్కడో ఒక దగ్గర నుంచి కాపీ కొట్టినవి అని ఫాన్స్ విమర్శిస్తూనే ఉంటారు. ఒక్క అలవైకుంఠపురం చిత్రం తప్ప మాక్సిమం అతను కంపోజ్ చేసిన అన్ని సినిమాలలో ఏదో ఒక పాట ,ఎక్కడో ఒక దగ్గర నుంచి కాపీ కొట్టిందే. ఈ విషయాన్ని కొందరు ఔత్సాహిక నటిజన్స్.. ఏ సాంగ్ నుంచి కాపీ కొట్టారు ఆధారాలు చూపించి మరి వైరల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఓజీ మూవీ థీమ్ సాంగ్ పై పలు రకాల విమర్శలు ఆన్లైన్లో వెళ్లువెత్తుతున్నాయి. అస్సలు ఏమాత్రం మార్పు లేకుండా మక్కీకి మక్కీ ఓజీ థీమ్ సాంగ్ ని పక్కాగా దింపేశాడు తమన్ అని ఆరోపించడమే కాకుండా ఒరిజినల్ సాంగ్ వీడియోని కూడా పోస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
అంతేకాకుండా బిజినెస్ మాన్ చిత్రంలోని ముంబై సాంగ్ కూడా ఇంచుమించు ఇదే తరహాలో ఉంది అన్న విమర్శలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి.అయితే సదరు పాట కాపీ అంటూ విమర్శలు రావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారు. ఓజీ థీమ్ సాంగ్ స్ప్లేషర్ పేరిట విడుదలైన ఆల్బమ్ లోని రైజ్ యువర్ షూస్ అనే పాట నుంచి పూర్తిగా కాపీ కొట్టినట్టు ప్రస్తుతం నెట్లో ఆ వీడియో పెట్టడంతోపాటు ఓజీ థీమ్ సాంగ్ ను వైరల్ చేస్తున్నారు నేటిజన్స్.
ALSO READ : “వీళ్లంతా ఎవరో కూడా అర్ధం అవ్వట్లేదు..!” అంటూ… “బిగ్‌బాస్ తెలుగు-7” లాంచ్ ఎపిసోడ్‌పై 10 మీమ్స్..!
End of Article