బుల్లితెరలో ఎక్కువ క్రేజ్ ఉన్న రియాల్టీ షో బిగ్ బాస్ ఏడవ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇటు ఖుషి ప్రమోషన్స్ కోసం విజయ్ అటు మిస్టర్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్స్ కోసం నవీన్ బిగ్ బాస్ స్టేజిపై కనిపించారు.

Video Advertisement

మరోపక్క కొంతమంది మాత్రం బిగ్బాస్ షోను ఎలాగైనా నిషేధించాలి అని ప్రొటెస్ట్ కూడా చేశారు. అయినా ఇలాంటివి ఎప్పుడూ ఉండేదే…మొదటి రెండు మూడు సీజన్లకు ఉన్న ఆదరింపు ఆ తర్వాత కాస్త పల్చబడిందని చెప్పవచ్చు. మరి లాస్ట్ సీజన్ అయితే కంటెస్టెంట్స్ కారణంగా ఫ్లాప్ అయ్యింది.

Trending memes on bigg Boss Telugu 7 launch episode

అది కూడా 24 అవర్స్ స్ట్రీమింగ్ అని చెప్పినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోనంత ఫ్లాప్ అంటే ఆలోచించండి మరి. అందుకే ఈసారి సీజన్ సెవెన్ తో తిరిగి తన స్టార్ డం వెనక్కి తెచ్చుకోవాలి అని బిగ్ బాస్ టీం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఏడో సీజన్లో విపరీతమైన అంచనాలను పెంచడానికి మొదటి ఎపిసోడ్ నుంచే నానా తంటాలు పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సరికొత్తగా ఉల్టా పుల్టా …ఎక్స్‌పెక్ట్ ది అన్‌ఎక్స్‌పెక్ట్ అని క్యాప్షన్ తో కాస్త హడావిడి కూడా పెంచారు.

మరోపక్క ఈసారి కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సీరియల్స్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న కంటెస్టెంట్స్ ను ఏరి కోరి జాగ్రత్తగా ఎంపిక చేశారు. సింగర్స్ కొరియోగ్రాఫర్స్, యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇలా కొంతమంది సెలబ్రిటీస్ కి కూడా బిగ్ బాస్ లో ఎప్పటిలాగే ప్లేస్ ఉంచారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో మొత్తం మీద ఎటువంటి ఫర్నిచర్ లేని ఇంటిలోకి మొదట కంటెస్టెన్షన్ పంపడం జరుగుతుంది. వాళ్లు బిగ్బాస్ నిర్ణయించిన టాస్క్లను విజయవంతంగా పూర్తి చేసి తర్వాత ఫర్నిచర్ ని గెలుచుకోవాలి.

ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే శివాజీ, షకీలా,కిరణ్ రాథోడ్ లాంటి టాలీవుడ్ నటులతో పాటు ప్రియాంక జైన్,శోభా శెట్టి,అమర్‌దీప్ చౌదరి ఇలాంటి సీరియల్ యాక్టర్స్ కూడా హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక వీళ్లతోపాటు ఫిట్నెస్ ఫ్రీక్ మరియు మోడల్ ప్రిన్స్ యావర్, ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ దామిని, యాక్టర్ నుంచి లాయర్ గా మారిన శుభశ్రీ రాయగురు, డాన్స్ తో అందరిని ఉర్రూతలూగించే ‘ఆటా’ సందీప్, జబర్దస్త్ కమెడియన్ టేస్టీ తేజ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రతిక అందరినీ అలరించడానికి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.

వీళ్లతో పాటుగా ఆకాశ వీధిలో చిత్రంతో హీరోగా పరిచయమైన డాక్టర్ గౌతమ్ మరియు అందరికీ సుపరిచితుడైన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి రోజే ట్విస్ట్ మొదలుపెట్టిన నాగార్జున టాప్ ఫైవ్ కంటెస్టెంట్కు ఓ బ్రీఫ్ కేస్ ఆశ చూపించడం జరిగింది. ఎవరికైనా డబ్బులు కావాలి అంటే ఇది తీసుకొని రేస్ లో నుంచి తప్పుకోవచ్చు అని ఆఫర్ ఇవ్వగా ఎవరు దాన్ని తీసుకోలేదు. ఇలా మొదటి రోజే ట్విస్టులతో మొదలైంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 7. మొదటి రోజే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అంటూ…చాలామంది ఈ షో గురించి మీమ్స్ చేస్తున్నారు. చాలామంది ఒక రెండు మూడు ఎపిసోడ్స్ జరిగేసరికి తిరిగి మళ్ళీ అంతా మామూలే…మాకు నమ్మకం లేదు దొర అని.. ఫన్నీగా మీమ్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

#1

#2#3#4#5#6#7#8#9

ALSO READ : ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఓటిటి లో రిలీజ్ అయిన ఈ చిన్న సినిమాలు చూసారా.? అందులో ఏముందంటే.?