Ads
వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మూవీ భోళాశంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా కనిపించింది. యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటించాడు.
Video Advertisement
భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న రిలీజ్ అయిన భోళాశంకర్ మూవీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఫ్యాన్స్ కూడా తీవ్రంగా నిరాశపరిచింది. తొలి షోకే నెగెటివ్ టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. కోరాలో ఈ మూవీ గురించి అభిప్రాయం అడుగగా, ఒక యూజర్ ఎలా స్పందించాడో ఇప్పుడు చూద్దాం..
“భోళా శంకర్ సినిమా గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని కోరాలో అడుగగా, దానికి సంతోష్ కుమార్. కె అనే యూజర్ సమాధానం ఇస్తూ, “వాపు చూసి బలుపు అనుకోకూడదు. మంచి పనయింది చిరంజీవి గార్కి, తెలుగు ప్రేక్షకులకి లేదంటే ఇంకెన్నెన్ని మేకులు దించేసే వారు. చిరంజీవి అంటే ఓ బ్రాండ్ ఉండేది. అది చిరంజీవి గారే స్వయంగా చెడగొట్టుకుంటున్నారు. వాల్తేర్ వీరయ్య విజయానికి చాలా కారణాలు ఉన్నాయి. కథ, కథనం ముఖ్యంగా సంగీతం ఇలాంటివి.
ఎప్పుడో ఎన్టీఆర్, ఎన్ ఆర్ లు యంగ్ హీరోయిన్లతో తైతక్కలాడితే అప్పట్లో కొత్త, ఇంకా వేరే దిక్కులేక చూసారు. మనవరాళ్ల వయసు వారితో అది ఇంత మంది యంగ్ స్టర్స్ ఉండగా, ఆ వెకిలి డాన్సులు చేస్తే సీనియర్ అభిమానులమైన మాకే వెగటు పుట్టేస్తుంది. ఇక ఆ వేదాలమే రొడ్డ సినిమా. మళ్ళీ దాన్ని 8 ఏళ్ల తరువాత మ్యూజియం లో నుండి బయటకు తీసి, కళా తపస్వి , కళా సృష్టి కర్త అయిన మెహర్ రమేష్ లాంటి దర్శక దిగ్గజానికి ఇచ్చి తెలుగు ప్రేక్షకుల పైకి వదలడం ఏమి న్యాయమో చిరంజీవి గారు ఆలోచించాలి.
నిజంగా రీమేక్ లు ఇష్టమయితే చిరంజీవి గారి పాత సినిమాలే రీమేక్ చేస్తే బెస్ట్ ఎందుకంటే అవి ఎవర్ గ్రీన్ సబ్జెక్స్. ఇంత ఫ్రస్ట్రేషన్ చూపించిన నేను సినిమా చూసానా అంటే లేదు. ఆ ట్రైలర్ చూస్తేనే తెలిసిపోయింది. ఎంత పొడవాటి బాకు ప్రేక్షకుల హృదయాలను తాక బోతున్నాయో అని. వృద్దాప్యాన్ని హుందాగా అంగీకరించి, కళా తృష్ణ తీర్చుకునే సినిమాలు చేస్తే మంచిది. కాదు ఇంకా మేము ఇరవైల్లోనే ఉన్నాం అనుకుంటే” అంటూ రాసుకొచ్చారు.
Also Read: “బ్రో” మూవీ గురించి… ఈ నెటిజెన్ పోస్ట్ చూస్తే నవ్వాపుకోలేరు..!
End of Article