Ads
హీరో మంచు విష్ణు లేటెస్ట్ గా నటిస్తూన్న మూవీ భక్త కన్నప్ప. ఈ మూవీ తన కలల ప్రాజెక్ట్ అని ఇప్పటికే చాలా సార్లు విష్ణు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని గత నెల శ్రీ కాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే.
Video Advertisement
భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 18న లాంచ్ చేశారు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తుండగా ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ఆయన దర్శకత్వం వహించిన పాపులర్ సీరియల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భక్త కన్నప్ప మూవీలో కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ బాలీవుడ్ కి చెందిన వ్యక్తి. అతను టెలివిజన్ దర్శకుడు. ముఖేష్ కుమార్ సింగ్ బీహార్‌లో పుట్టి పెరిగాడు. డ్రామాటిక్ ఆర్ట్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. అందులో ముఖేష్ కుమార్ గోల్డ్ మెడల్ అందుకున్నాడు.
ఆల్ ఇండియా రేడియో, సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఆఫ్ ఇండియా మొదలైన వాటిలో ఎన్నో నాటకాలలో నటించాడు. దర్శకత్వం వహించాడు. ముఖేష్ 2000వ సంవత్సరంలో దర్శకుడు కావడం కోసం ముంబైలో అడుగుపెట్టాడు. ముఖేష్ కెరీర్ ప్రారంభంలో శ్రీ అధికారి బ్రదర్స్‌తో కలిసి పనిచేశాడు. ఆ తరువాత మొదట థ్రిల్లర్ ‘సురాగ్’ కు అవకాశం పొందాడు. ఆ తరువాత అనేక ప్రసిద్ధ పౌరాణిక మరియు చారిత్రక టెలివిజన్ షోలకు దర్శకత్వం వహించాడు.
ముఖేష్ ఇండియన్ టెలివిజన్‌లో అతి పెద్ద షో మహాభారతానికి దర్శకత్వం వహించాడు. ఇది 100 కోట్ల టీవీ షోగా గుర్తింపు పొందింది. మేరే సాయి, చంద్ర నందిని, రజియా సుల్తాన్, హనుమాన్, బంధన్, మీరా, రామాయణం, భాగ్య విధాత, ద్వారకాధీష్ వంటి షోలతో బుల్లితెరపై మ్యాజిక్ క్రియేట్ చేశాడు. భక్త కన్నప్ప మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.
Also Read: “నవీన్ పోలిశెట్టి” ఒక నాని సినిమాలో నటించారు అని మీకు తెలుసా..? ఆ సినిమా ఏంటంటే..?
End of Article