ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకే ఒక నటుడి పేరు వినిపిస్తోంది. ఆయనే నవీన్ పోలిశెట్టి. ఇటీవల రిలీజ్ అయిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు నవీన్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా సైలెంట్ గా రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ టాక్ సంపాదించుకుంది.

Video Advertisement

సినిమా చూసినవారు అందరూ కూడా నవీన్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది అన్నారు. చంటబ్బాయి సినిమా కొత్త వెర్షన్ చూసినట్టు ఉంది అన్నారు.

nani movie in which naveen polishetty acted in a roleఇప్పటికి కూడా ఈ సినిమాకి రిపీట్ వాల్యూ ఉంది. అందుకే యూట్యూబ్ లో ఈ సినిమాకి సంబంధించిన కామెడీ సీన్స్ కి లక్షల్లో వ్యూస్ ఉంటాయి. ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాలో నటించారు. అప్పటి వరకు మూతపడ్డ థియేటర్లని తెరిపించి కాసుల వర్షం కురిపించిన సినిమా ఇది. ఈ సినిమాలో నవీన్ మాట్లాడిన డైలాగ్స్, మేనరిజమ్స్ విపరీతంగా ఇమిటేట్ చేస్తారు.

nani movie in which naveen polishetty acted in a role

నవీన్ సినిమాకి సినిమాకి చాలా గ్యాప్ వస్తుంది. ఇప్పుడు జాతి రత్నాలు రిలీజ్ అయిన రెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమా వచ్చింది. చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూడడానికి ముఖ్య కారణం దాదాపు 5 సంవత్సరాల తర్వాత అనుష్క శెట్టి సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. కానీ అనుష్క కోసం సినిమా చూడడానికి వెళ్ళిన ప్రేక్షకులు అందరూ కూడా నవీన్ కమిటీ టైమింగ్ కి మరొక సారి ఫిదా అయిపోయారు.

nani movie in which naveen polishetty acted in a role

“అనుష్క చాలా బాగా చేశారు. అందులో సందేహం అస్సలు లేదు. కానీ నవీన్ కూడా అంతే బాగా చేశారు” అంటూ నవీన్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కానీ ఇప్పుడు నవీన్ కి వచ్చిన ఈ గుర్తింపు వెనుక కొన్ని సంవత్సరాల కష్టం ఉంది. చాలా సినిమాల్లో నవీన్ చాలా చిన్న పాత్రల్లో నటించారు. కొన్ని సినిమాల్లో అక్కడ ఆ పాత్ర చేసిన వ్యక్తి నవీన్ అనే విషయం కూడా చాలా మందికి తెలియదు.

nani movie in which naveen polishetty acted in a role

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నవీన్ పోలిశెట్టి నటించిన సంగతి అందరికీ తెలిసిందే. గోల్డ్ ఫేస్ కాలనీలో ఉండే ఒక వ్యక్తిగా నవీన్ పోలిశెట్టి నటించారు. ఈ సినిమాలో నవీన్ ఉన్నారు అంతే. ఆ తర్వాత వచ్చిన 1 నేనొక్కడినే సినిమాలో ఒక చిన్న పాత్రలో నవీన్ కనిపిస్తారు. చిన్న పాత్ర అయినా కూడా చెబితే గుర్తుపట్టగలిగే పాత్ర ఈ సినిమాతో నవీన్ కి దక్కింది.

nani movie in which naveen polishetty acted in a role

తర్వాత హిందీలో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు.  ఇంజనీరింగ్ మీద చేసిన ఒక వీడియోతో చాలా పాపులర్ అయిపోయారు. అయితే నవీన్ పోలిశెట్టి హీరో నాని సినిమాలో కూడా నటించారు అనే సంగతి చాలా మందికి తెలియదు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో నాని ఉండరు. చాలా సంవత్సరాల క్రితం నాని ప్రొడ్యూసర్ గా డి ఫర్ దోపిడీ అనే సినిమా చేశారు. కొంత మంది యువకులు ఒక బ్యాంకు దొంగతనానికి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు అనే విషయం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది.

Actor who started their careers with side roles

ఫ్యామిలీ మెన్ సిరీస్ కి దర్శకత్వం వహించిన రాజ్-డీకే ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. వీరితో కలిసి నాని ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో ఒక పాటలో కూడా నాని కనిపిస్తారు. అంతే కాకుండా ఈ సినిమాకి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. ఇందులో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ నటించారు. వారితో పాటు మరొక పాత్రలో నవీన్ పోలిశెట్టి కూడా నటించారు. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉన్నా కానీ ప్రేక్షకులకి అప్పుడు పెద్దగా ఎక్కకపోవడంతో సినిమాకి పెద్ద గుర్తింపు రాలేదు. కానీ తర్వాత ఎన్నో ఆడిషన్స్ ఇస్తూ, యూట్యూబ్ వీడియోల ద్వారా గుర్తింపు సంపాదించుకున్నారు నవీన్ పోలిశెట్టి.

ALSO READ : హీరోగా ఒక వెలుగు వెలిగిన ఈ వ్యక్తికి ఏమయ్యింది..? ఇతని ఫెయిల్యూర్ కి కారణాలు ఇవేనా..?