సీనియర్‌ హీరో కార్తీక్‌ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీతాకోక చిలుక లాంటి క్లాసిక్‌ మూవీతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు. పేరుకు కార్తీక్ తమిళ హీరో అయినా, వరుసగా తెలుగు చిత్రాలలో నటించాడు. అన్వేషణ, అభినందన వంటి చిత్రాలను ఆడియెన్స్ అంత తేలికగా మర్చిపోలేరు.

Video Advertisement

అయితే అందరూ టాప్ హీరో అవుతాడని భావించిగా, కార్తీక్ కెరీర్ పతనం అయ్యింది. ఆ తరువాత చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి, విలన్ గా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు. అయితే కార్తీక్ కెరీర్ పతనం అవడానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. సినిమాల్లో చాలా ట్విస్టులు చూస్తుంటాం. కొన్నిసార్లు నిజ జీవితంలో దానికన్నా ఎక్కువ ట్విస్టులే ఊహించని విధంగా  వస్తుంటాయి. దానితో ఎక్కడో ఉండాల్సిన జీవితం మారెక్కడీకో మారుతుంది. సీనియర్‌ హీరో కార్తీక్‌ లైఫ్ కూడా ఇలాంటిదే.  సౌత్‌లో వందకు పైగా చిత్రాలలో నటించిన కార్తీక్ టాప్ హీరోగా కొనసాగుతాడని అంతా భావించారు. కానీ ఇండస్ట్రీకి  దూరం అయ్యారు. కార్తీక్ అసలు పేరు మురళి కార్తికేయన్‌ ముత్తురామన్‌. ఆయన తండ్రి కోలీవుడ్ లో గొప్ప యాక్టర్ ఆర్‌ ముత్తురామన్‌. మచ్చలేని మనిషిగా పేరు గాంచారు.నటనను తండ్రి నుండి వారసత్వంగా పొందిన కార్తీక్ భారతీరాజా దర్శకత్వం వహించిన అలైగళ్‌ ఒవతిల్లై అనే మూవీతో 1981లో కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సాధించింది. కార్తీక్‌ లుక్స్‌, నటన మెచ్చిన దర్శకులు తమ చిత్రాలలో నటించమని వెంటపడ్డారు. అలా అతి తక్కువ టైమ్ లోనే  తమిళ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా ఎదిగాడు. సీతాకోక చిలుక మూవీ తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తరువాత అన్వేషణ, గోపాలరావు గారి అబ్బాయి, అభినందన లాంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు. తమిళంలో సంవత్సరానికి 8-10 చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉండటంతో కార్తీక్ తెలుగులో ఎక్కువగా నటించలేకపోయాడు. అయినా తెలుగులో తక్కువ సినిమాలే చేసినా హీరో కార్తీక్‌ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభినందన మూవీకి నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డు కూడా అందుకున్నాడు. కోలీవుడ్ లో స్టార్‌ హీరోగా పేరుతెచ్చుకున్న తరువాత నుండే  కార్తీక్‌ కెరీర్ పడిపోవడం మొదలైంది అంటారు.
కార్తీక్ తరచూ ఎవరో ఒక హీరోయిన్‌తో ఎఫైర్‌ పెట్టుకున్నట్టుగా వార్తలు వినిపించేవి. ఈ క్రమంలో హీరోయిన్‌ రాగిణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి గౌతమ్‌ కార్తీక్‌, జ్ఞాన్‌ కార్తీక్‌ ఇద్దరు పిల్లలు. అయితే ఆ తరువాత టం ఇంట్లోనే ఉంటున్న భార్య చెల్లెలు రతితో ఎఫైర్‌ పెట్టుకున్నట్లుగా, రతి ప్రెగ్నెంట్ అని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ తరువాత రతిని రెండవ వివాహం చేసుకున్నాడు. దాంతో కార్తీక్ పై తీవ్రమైన  విమర్శలు వచ్చాయి. కార్తీక్‌పై అతని తోబుట్టువులు  కేసు వేశారు. తండ్రి ముత్తురామన్ ఆస్తులలో తమ హక్కును కోరుతూ కేసును వేశారు.
ఆ సమయంలో కార్తీక్ సినిమాల పై దృష్టి పెట్టలేకపోయాడు. అది కూడా ఒక కారణం. కార్తీక్ షూటింగ్ స్పాట్‌ ఆలస్యంగా రావడం అలవాటు, దాంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతని వల్ల రమేష్ కన్నా అనే దర్శకత్వం వహించిన తొలి మూవీ ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోలేదు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కార్తీక్ ఆల్కహాల్ మరియు డ్రగ్స్ కు బానిస. ఈ చెడు వ్యసనాల వల్లే తన కెరీర్‌ పతనం అయ్యిందని స్వయంగా కార్తీక్ ఒక  ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Also Read: “చిరంజీవి” నుండి… “షారుక్ ఖాన్” వరకు… ఘోరమైన “ఫ్లాప్” తర్వాత కంబ్యాక్ ఇచ్చిన 8 హీరోస్..!