భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ ఇండస్ట్రీ టాలీవుడ్. గత 2-3 ఏళ్ల నుండి బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తోంది తెలుగు సినిమాలే. ఈ ఏడాది అలా మొదలవగానే 5 చిత్రాలకు పైగా సూపర్‌హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ సినిమాల పరంగా ఈ 2023లో తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికే మిగతా ఇండస్ట్రీల కన్నా ముందుంది.

Video Advertisement

అయితే ఈ ఏడాది పలువురు హీరోలు సూపర్ హిట్ సినిమాలతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

#1 చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ ర‌వితేజ హీరోలుగా వచ్చిన వాల్తేర్ వీర‌య్య సినిమా సంక్రాంతికి విడుదలై 230 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ వసూల్ చేసింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, సంక్రాంతి విజేతగా నిలిచింది.

tollywood heros who gave blockbuster comeback this year..!!

చిరు నటించిన గత చిత్రాలు సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలకు ఆశించిన ఫలితం రాలేదు. దీంతో ఈ ఏడాది వాల్తేరు వీరయ్య తో సూపర్ హిట్ కొట్టాడు చిరు.

#2 విజయ్

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, రష్మికా మందన్న జంటగా నటించిన వారసుడు మూవీ సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 14న రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. కోలీవుడ్ లో సూపర్ హిట్ అవగా, తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.

tollywood heros who gave blockbuster comeback this year..!!

ఈ చిత్రానికి ముందు విజయ్ నటించిన బీస్ట్ చిత్రం ప్లాప్ అయ్యింది. దీంతో ఈ చిత్రం తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు విజయ్.

#3 ధనుష్

2021 లో సెల్వరాజ్ దర్శకత్వం లో వచ్చిన కర్ణన్ మూవీ తర్వాత ధనుష్ నటించిన చిత్రాలు అన్నిటికి యావరేజ్ రిజల్ట్ వచ్చింది. ఇక తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వం లో వచ్చిన సర్ మూవీ తో సూపర్ హిట్ కొట్టాడు ధనుష్. ఆ తర్వాత తిరు సినిమాతో హిట్ కొట్టారు. కానీ సర్ సినిమా మాత్రం తిరు సినిమా కంటే కూడా చాలా పెద్ద హిట్ అయ్యి ధనుష్ ఎంత పెద్ద హీరో అనేది మరొకసారి నిరూపించింది.

tollywood heros who gave blockbuster comeback this year..!!

#4 నాని

‘శ్యామ్ సింగ రాయ్’ తర్వాత నాని చేసిన ‘అంటే సుందరానికి’ మూవీ ప్లాప్ అయ్యింది. ఇక ఈ ఏడాది కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ తో హిట్ కొట్టాడు నాని.

tollywood heros who gave blockbuster comeback this year..!!

#5 కిరణ్ అబ్బవరం

తన రెండో సినిమా ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ తర్వాత కిరణ్ కి సరైన హిట్ రాలేదు. ఈ ఏడాది వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. కానీ ఆ తర్వాత వెంటనే వచ్చిన ‘మీటర్ ‘మూవీ ప్లాప్ అయ్యింది.

tollywood heros who gave blockbuster comeback this year..!!

#6 షారుక్ ఖాన్

గత అయిదేళ్లుగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి హిట్ లేదు. ఇక ఈ ఏడాది వచ్చిన పఠాన్ మూవీ తో సూపర్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు.

tollywood heros who gave blockbuster comeback this year..!!

#7 సాయి ధరమ్ తేజ్

‘రిపబ్లిక్’ మూవీ ప్లాప్ అయిన తర్వాత ఆక్సిడెంట్ కావడం తో దాదాపు 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని ‘విరూపాక్ష’ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

tollywood heros who gave blockbuster comeback this year..!!

#8 అల్లరి నరేష్

నాంది వంటి సూపర్ హిట్ తర్వాత అల్లరి నరేష్ కి సరైన హిట్ రాలేదు. అయితే తాజాగా రిలీజ్ అయిన ఉగ్రం మూవీ తో హిట్ కొట్టాడు అల్లరి నరేష్.

tollywood heros who gave blockbuster comeback this year..!!