Ads
నటీనటులు తాము నటిస్తూన్న సినిమాకు, స్టోరీకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఎల్లప్పుడు ఒకే లుక్ లో కనిపించినా వారి అభిమానులు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. గత కొన్నేళ్లుగా డిఫరెంట్ కథలతో చిత్రాలు ఎక్కువగా తెరకెక్కుతూ ఉండడంతో హీరోలు కూడా దానికి తగినట్టుగా వారి లుక్స్ ను మారుస్తున్నారు.
Video Advertisement
ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సల్మాన్ ను అలా చూసిన వారు సల్మాన్ ఖాన్ కి ఏమైంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో టాప్ హీరోగా రాణిస్తున్న సల్మాన్, తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించాడు. తన సినిమాలతో బాలీవుడ్ లో ఎన్నో రికార్డ్స్ సృష్టించాడు. ఇటీవలే ‘కిసీ కా భాయ్, కిసీ కీ జాన్’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్, త్వరలో టైగర్ 3 మూవీతో రానున్నాడు. టైగర్ 3 మూవీ లో బిజీగా ఉన్న సల్మాన్, రీసెంట్ గా సరికొత్త లుక్ లో కనిపించి అందరినీ షాక్ కి గురి చేశాడు. సల్మాన్ ఒక రెస్టారెంట్‌కు వెళ్ళిన వీడియో వైరల్ గా మారింది. ఇందులో సల్మాన్ ఖాన్ గుండుతో కనిపించాడు. దీంతో ఆ ఫొటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇన్‌స్టా లో సల్మాన్ గుండు వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో సల్మాన్ నిజంగా ఇలా ఉంటారా లేదా ఏదైనా సినిమా కోసం మార్చుకున్న లుక్ కావచ్చని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.
ఇంతకుముందు సల్మాన్ ఖాన్ ఈ లుక్ లో తేరే నామ్, సుల్తాన్ సినిమాలలో కనిపించాడు. దాంతో ఫ్యాన్స్ వాటి సీక్వెల్స్ తీస్తున్నారా అని కామెంట్లు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో పంజా మూవీ తీసిన డైరెక్టర్ విష్ణువర్ధన్ తో సల్మాన్ ఖాన్ హీరోగా నిర్మాత కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసమే కండల వీరుడు గుండు చేయించుకున్నాడని టాక్.
https://www.instagram.com/reel/CwLQYJZIqDX/?utm_source=ig_embed&ig_rid=3926fc4d-0be6-4a21-a316-bc8f9c4cef07
Also Read: “జైలర్” సినిమాలో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా రజినీకాంత్ గారూ..?
End of Article