సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘జైలర్‌’. ఈ మూవీకి ‘బీస్ట్’ మూవీ దర్శకుడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. కళానిధి మారన్ ‘సన్ పిక్చర్స్‌’ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు.

Video Advertisement

ఆగస్ట్ 10 న రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కోలీవుడ్ లో పలు రికార్డులు బ్రేక్ చేసింది. అయితే నెటిజెన్లు ఈ మూవీలోని ఒక మిస్టేక్ ను నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
comments on this scenes in jailerరజినీకాంత్ , రమ్యకృష్ణ, తమన్నా, వసంత్ రవి, సునీల్ నటించిన జైలర్ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ యాక్టర్ జాకీష్రాఫ్ అతిథి పాత్రలలో నటించారు. ఈ మూవీ తమిళ, తెలుగు బాషలలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాలను కురిపించింది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న, సూపర్ స్టార్ రజినీకాంత్ కు, నెలన్స్ దిలీప్ కుమర్ కు ఈ మూవీ ఊహించని విజయాన్ని ఇచ్చింది.
jailer movie reviewథియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన జైలర్ మూవీ రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అక్కడ కూడా రికార్డ్స్ క్రియట్ చేస్తోంది. అయితే ఓటీటీ లో పలుమార్లు ఈ మూవీని చూసిన నెటిజెన్లు ఈ చిత్రంలోని మిస్టేక్స్ ను గమనించారు. వాటిని సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో షేర్ చేస్తున్నారు. మూవీ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రజినీకాంత్ జైలర్ గా ఉంటాడు. ఆ సమయంలో ఒక ఖైదీ నేను ఏపీ నుండి వచ్చా, ఒక ఫోన్ కొడ్తే చాలు నీ అంతు చూస్తారని రజినీకాంత్ తో అంటాడు.
నాకు చాలా పెద్ద కాంటాక్స్ ఉన్నాయని అంటాడు. దాంతో రజినికాంత్ ఫోన్ ఇచ్చి, కాల్ చేయమని చెప్తాడు. అప్పుడు ఆ ఖైదీ తన మనుషులకి కాల్ చేసాడు. కానీ హీరో వారి కారులో బాంబు పెట్టి పేల్చేస్తాడు. ఆ విషయం తెలిసి ఆ ఖైదీ షాక్ అవుతాడు. అయితే ఖైదీకి ఇచ్చిన ఫోన్ ని తిరిగి తీసుకోడు. మరో సీన్ లో విలన్ పంపించిన రౌడీలు రజినీకాంత్ ఫ్యామిలి పై దాడి చేయడానికి వస్తారు. అప్పుడు రజినీకాంత్ మనవడిని ఒకదగ్గర దాచిపెడతాడు. కానీ అక్కడి నుండి తీసుకొచ్చినట్టు చూపించరు. ఇలా మర్చిపోతే ఎలా రజినీకాంత్ గారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: “జవాన్” సినిమా మీద ఒక నెటిజన్ పోస్ట్..! సినిమా కంటే ఇదే బాగుంది..!