“జవాన్” సినిమా మీద ఒక నెటిజన్ పోస్ట్..! సినిమా కంటే ఇదే బాగుంది..!

“జవాన్” సినిమా మీద ఒక నెటిజన్ పోస్ట్..! సినిమా కంటే ఇదే బాగుంది..!

by kavitha

Ads

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా  ‘జవాన్’. ఈ చిత్రం సెప్టెంబర్ 7న తమిళ్, హిందీ, తో పాటుగా తెలుగు, కన్నడ, మలయాళంలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. తొలి షోతోనే సూపర్ హిట్  టాక్ తెచ్చుకుంది.

Video Advertisement

స్టోరీలో కొత్తదనం లేకపోయినా,  అట్లీ మార్క్ టేకింగ్, షారుఖ్ ను చూపించిన తీరు ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నయనతార, విజయ్ సేతుపతి నటించిన ఈ మూవీ గురించి కోరాలో అడిగిన ప్రశ్నకు ఒక యూజర్ ఎలా సమాధానం ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం..
“షారుఖ్ జవాన్ సినిమా ఎలా ఉంది, మీ వ్యూ తెలుపగలరా సర్ ?” అని కోరాలో అడిగిన ప్రశ్నకు పవన్ బ్యాంకింగ్ హెచ్ఆర్  అనే యూజర్ ఇలా జవాబు ఇచ్చారు. “జవాన్ విశ్లేషణ : ఇప్పటివరకు ఫెయిల్యూర్ సినిమా లేని డైరెక్టర్ ‘అట్లీ’ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ ల కాంబో లో ‘జవాన్’ సినిమా అనగానే అంచనాలు తారా స్థాయికి చేరి ఈ రోజు ప్రపంచం వ్యాప్తంగా విడుదలైంది. ఇదెలా ఉందో తెలిపే ప్రయత్నం చేస్తా.
jawan first reviewవిశ్లేషణ: ఒక నిజాయితీ గల ఆర్మీ ఆఫీసర్ దేశద్రోహిగా క్రియేట్ చేయబడి చనిపోవడం, అది నిజం కాదని కొడుకు ప్రూవ్ చేయడం అనే లైన్ తో ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చాయి. ఈ సినిమా కూడా అదే కోవకి చెందినది. కొన్ని కుట్రల వల్ల హత్యకి గురి కాబోయి, కొన ఊపిరితో ఒక గ్రామానికి చేరి ఆ గ్రామస్తులు చేయించిన వైద్యంతో రక్షించబడి ఒకానొక టైమ్ లో  ఆ ఊరినే కాపాడిన ఆఫీసర్ అనే సీన్ తో అసలు ఎలివేషన్ స్టార్ట్ అవుతుంది.
jawan-prevueతర్వాత ఒక పెద్ద బిజినెస్ మాన్(కాళీ) కూతురిని ట్రైన్ హైజాక్ లో అపంహరించి, డబ్బులు డిమాండ్ చేసి నలబై వేల కోట్లు లాగేయడం ఆ డబ్బునంతా రైతుల రుణాల కోసం వెచ్చించడం లాంటి రాబిన్ హుడ్ హీరోగా అసలు కధను మొదలెడతారు. ఇది రుచించక విలన్ అతనిని ట్రాప్ చేసి చంపబోయే ప్రయత్నంలో విక్రమ్ రాథోడ్ (మరో షారుఖ్) సూపర్ ఎంట్రీ ఇవ్వడం, ఇక ఇక్కడి నుండే కధ అనూహ్య మలుపులు తీసుకోవడం, అసలు వీళ్లెవరు, ఆ కాళీ ఎవరు, వీళ్ళ కదేంటి అనేదే మిగిలిన సగం సినిమా. ఇలా, ఒక కథగా చూస్తే ఎక్కడా కొత్తగా అనిపించదు, చాలా సినిమాలు జ్ఞప్తికొస్తాయి.
జస్ట్ హీరో ఎలివేషన్లతో, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్ లతో చాలావరకు ప్రేక్షకులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ కొన్నిచోట్ల పెదవి విరుపులైతే తప్పలేదు. ఇక కాంబో విషయానికొస్తే, షారుఖ్ ఖాన్ లాంటి హీరోని పెట్టుకొని కొత్త కథతో వస్తాడనుకుంటే మనం చూసిన ఎన్నో కథలను మిక్స్ చేసి ఈ రొట్ట రొటీన్ సినిమా తీశాడు అట్లీ, కాకపోతే ఇదొక బాలీవుడ్ మూవీ అంతే. కాకపోతే ప్రస్తుతం సొసైటీలో  ప్రధాన సమస్యలైన రైతులు, వారి ఆత్మహత్య లు, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో విధి విధానాలు లాంటి వాటిని కమర్షియాలిటీ జోడించి హృద్యంగా తెరకెక్కించిన తీరు మాత్రం మెప్పిస్తుంది.
jawan-prevueఎవరెలా చేశారంటే..

సినిమా మొత్తం మీద మన తెలుగు, తమిళ సినిమాల తాలూకు ఫ్లేవర్ ఎక్కడికక్కడ కొడుతూనే ఉంటుంది. కధ విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ, విలనిజంలో కానీ, వాణిజ్య అంశాల విషయంలో కాని, డబుల్ రోల్ లో కానీ ఇలా పోలికలు చాలా చాలా దగ్గరగా ఉంటాయి. అంతా చూసిన సినిమాలానే తడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ఒక సౌత్ సినిమాలో షారుఖ్ ఖాన్ హీరోగా చేశాడనే అనిపిస్తుంది. కానీ ఎక్కడా బాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగనే కలగదు. దానికి తగ్గట్లే షారుఖ్ కూడా తనదైన మానరిజంతో ఎప్పట్లాగే ఆదరగొట్టేశాడు. కానీ కొత్తగా చేసిందేమీ లేదు.
అలాగే షారుఖ్ డైలాగులు కూడా కొంతలో కొంత ఆలోచింపచేసే విధంగా ఉంటాయి, కధగా ‘జవాన్’ పాతదైనా రొటీన్ అయినా, రేసీగా స్క్రీన్ ప్లే రాసుకుని తెరకెక్కించాడు అట్లీ. ఇక అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల గూస్ బాంప్స్ తెప్పించింది. పాటలు మాత్రం పెద్దగా ఎక్కలేదనేది నిజం. విజయ్ సేతుపతి విలనిజంలో పస లేదు, నయనతార ఓకే. దీపికా, సంజయ్ దత్ వి పెద్ద పాత్రలేమి కావు. కానీ బానే చేశారు. ప్రియమణి పాత్ర బాగా డిజైన్ చేశారు. కానీ చివరలో నయనతార కోసం ఆ పాత్రను చంపేసినట్లు అనిపిస్తుంది.
comments on shah rukh khan jawan prevueప్లస్ & మైనస్: షారుఖ్, విజయ్ సేతుపతి, అనిరుధ్ , యాక్షన్ సీన్స్ ప్లస్ కాగా, పాత కధ, నచ్చని పాటలు పెద్ద మైనస్ అయ్యాయి.

ఎవరు ప్రధానం: పెద్దగా బోర్ కొట్టకుండా – గ్రాండ్ విజువల్స్ కాసేపు సినిమాని మోస్తే, షారుఖ్ మిగిలిన కాసేపు సినిమాని మోశాడు.

ఎవరు చూడొచ్చు: యాక్షన్ సినిమాలని ఇష్టపడేవారు, షారుఖ్ అభిమానులూ చూడొచ్చు.

మరి మిగిలినోళ్లు: అవేమీ అవసరం లేదనుకునే ప్రేక్షకుడు కూడా ఓసారి చూసేయచ్చు.

బాటం లైన్ : జవాన్ ‘చూడాల్సిన సినిమా’ అని చెప్పను కానీ ‘చూడదగ్గ సినిమా’ అని మాత్రం చెప్పగలను.. థాంక్యూ” అంటూ వివరించారు.

Also Read: పుష్ప-2లో బన్నీ ఎడమచేతి గోరుకి పింక్ కలర్ ఎందుకు?


End of Article

You may also like