ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అర్జున్ దాస్ ‘అనీతి’ సినిమా

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అర్జున్ దాస్ ‘అనీతి’ సినిమా

by Harika

Ads

వసంత బాలన్ దర్శకత్వంలో అర్జున్ దాస్ హీరోగా నటించిన సినిమా ‘అనీతి’. ఈ సినిమాకి అగ్రదర్శకుడు శంకర్ ప్రజెంటర్‌గా వ్యవహరించారు.

Video Advertisement

అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన రెండునెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

ధనవంతుల ఇంట్లో పనిచేసే అమ్మాయికి, ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కి మధ్య జరిగే ప్రేమ కథ. ఈ సినిమాలో బీదవారు, ధనవంతుల మధ్య ఉండే విషయాలను క్రైమ్ థ్రిల్లర్‌గా చూపించడమే కాకుండా ఎమోషనల్‌గా కూడా చూపించారు. ఇందులో అర్జున్ దాస్ మానసిక సమస్యతో ఇబ్బంది పడుతూ మనుషుల్ని చంపాలని అనుకుంటాడు. ఈ సినిమా తెలుగులో బ్లడ్ అండ్ చాకోలెట్‌గా రిలీజ్ అయ్యింది.

తమిళ హీరో అయిన అర్జున్ దాస్ బుట్టబొమ్మ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాతోనే తెలుగులో ఎందుకు ఎంట్రీ ఇచ్చాడంటే.. సమయం కుదరక. ఎన్నో సినిమాలు ఆఫర్ వచ్చినా సరే.. తమిళ సినిమాల వల్ల డేట్స్ సరిగ్గా సెట్ అయ్యేవి కాదు. చివరికి ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.

సినిమా షుటింగ్ అంతా వైజాగ్‌లో జరిగింది. అయితే ఇక్కడి గ్రామ ప్రజలు నన్ను చూడటానికి వచ్చారు. తమిళ హీరో అయిన నన్ను గుర్తించినందుకు చాలా సంతోషం అనిపించిందని కూడా అర్జున్ దాస్ తెలిపారు. అలాగే హిందీ, మలయాళంలో కూడా అర్జున్ దాస్ సినిమాలు లైన్లో ఉన్నట్లు సమాచారం.


End of Article

You may also like