Ads
యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం స్కంద టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న బాలీవుడ్ బ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Video Advertisement
డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రామ్ పూరీ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని సమాచారం.

ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు మళ్లీ సీక్వెల్ వస్తుంది. డబుల్ ఇస్మార్ట్ పేరుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల కిందటే ఈ సినిమా షుటింగ్ కూడా మొదలైంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించనున్నాడు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ఈ సినిమా షుటింగ్ ముంబైలో జరుగుతోంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా మూవీ టీమ్ ప్రకటించలేదు. కానీ స్టార్ హీరోయిన్ అయిన సారా ఆలీఖాన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే తెలుగు ఇండ్రస్టీలో సారా మొదటిసినిమా ఇదే అవుతుంది.

ఒకప్పుడు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడినా ఈమె అప్పటిల్లో లావుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఫిట్‌గా మారి అందంగా ఉంది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈమెకు తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.
End of Article
