Ads
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సౌత్ ఇండియా స్టార్ నయనతార నటించిన జవాన్ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో ముందుకు దూసుకెళ్తున్న ఈ సినిమాను స్టార్ డైరక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు.
Video Advertisement
తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో కూడా ఈ సినిమా దుమారం రేపుతోంది. సినిమా రిలీజ్ అయిన పదిరోజులకే ప్రపంచ వ్యాప్తంగా 797.50కోట్లు వచ్చిందని జవాన్ టీమ్ తెలిపింది.
ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనే, ప్రియమణి, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ వంటి ప్రధాన యాక్టర్లు కూడా ఉన్నారు. ఈ సినిమాలో దీపికా షారుక్‌కి జంటగా గెస్ట్ రోల్ చేసింది. షారుఖ్ సొంత బ్యానర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి అనిరుద్ద్ సంగీతం అందించాడు. అయితే థియేటర్లో సందడి చేస్తున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని చాలామంది ఎదురుచూస్తున్నారు.
దీనికి డైరక్టర్ అట్లీ స్పందిస్తూ.. షారుఖ్ ఖాన్ రన్ టైమ్, ఎమోషనల్ సీన్లతో జవాన్ సినిమాను థియేటర్లలో విడుదల చేశాం. ఇంకా కొన్ని సీన్లు మళ్లీ యాడ్ చేయాలని అనుకుంటున్నాం. ఓటీటీలో ఈ సినిమా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే విధంగా ఉంటుందని అట్లీ తెలిపారు. కానీ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందని మాత్రం చెప్పలేదు.
ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. దీనికోసం సుమారుగా రూ.250కోట్లు వెచ్చించిందట. అయితే ఈ సినిమా నవంబర్ మొదటివారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీపావళి కానుకగా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. జవాన్ హిట్‌తో సంతోషంగా ఉన్న అట్లీ అల్లుఅర్జున్‌తో సినిమా చేయనున్నట్లు సమాచారం.
End of Article