స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు తరఫున లూథ్రా, సాల్వే ఎలా వాదించారు..? కోర్టులో వాళ్లు ప్రస్తావించిన విషయాలు ఎంటంటే..?

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు తరఫున లూథ్రా, సాల్వే ఎలా వాదించారు..? కోర్టులో వాళ్లు ప్రస్తావించిన విషయాలు ఎంటంటే..?

by kavitha

Ads

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో పదకొండు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో క్వాష్ పిటిషన్‌ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో  విచారణ జరిగింది.

Video Advertisement

ఈ కేసులో చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సిద్ధార్థ లూథ్రా మరియు హరీష్ సాల్వేలు వాదించారు. వీరిద్దరు పలు పాతకేసులను ఉదహరించడంతో పాటు పలు లాజిక్‌లను కూడా కోర్టుకి వినిపించారు. మరి వీరిద్దరూ ఎలా వాదించారు? ఏం వాదించారు? అనేది ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం, టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుపై ఏపీ గవర్నమెంట్ పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై నిన్న ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీష్ సాల్వేలు మధ్యాహ్నం పన్నెండుగంటల నుంచి 2 గంటల వరకూ వాదనలు వినిపించారు.
ఏపీ హైకోర్టులో హరీష్ సాల్వే వాదించిన విషయాలు..

  • హరీష్ సాల్వే వర్చువల్‍గా తన వాదనలు వినిపించారు.
  • చంద్రబాబు నాయుడు అరెస్టులో సరి అయిన రూల్స్ ను పాటించలేదు.
  • అలాగే అరెస్ట్ విషయంలో గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు.
  • అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17A ప్రకారంగా అరెస్ట్‌ చేసినట్టు చూపించారు.
  • ఈ సెక్షన్ ప్రకారం అయితే గవర్నర్‌ అనుమతి తీసుకున్న తరువాతే పోలీసులు అరెస్ట్‌ చేయాలి.
  • ప్రజాప్రతినిధుల అరెస్టు పై గతంలో ఇచ్చిన తీర్పులు చాలా ఉన్నాయి.
  • 2020లో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు నాయుడును అరెస్ట్ ఎలా చేస్తారు?
  • అరెస్ట్ చేసే టైమ్ కి చంద్రబాబు నాయుడి పై ఎఫ్ఐఆర్ లేదు.
  • ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తరువాతే అరెస్ట్ చేయాలి.
  • చంద్రబాబు నాయుడు అరెస్ట్ 2024 ఎలెక్షన్స్ దృష్టిలో ఉంచుకుని చేశారు.
  • ఇదంతా పాలన ప్రతీకారంలా ఉంది.
  • సీమెన్స్‌ కంపెనీ చేసిన మెయిల్‌ ఆధారంగా ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్‌ కంప్లైంట్ చేశారు.
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో సేవలను అందించిన కంపెనీ సీమెన్స్‌ కంపెనీకి చెందిన ఉప కంపెనీయే.
  • గవర్నమెంట్ బాధ్యత ఫండ్స్ రిలీజ్ చేయడం, సేవలు పొందడం.
  • సిఐడి ఆరోపించినట్టు సాక్ష్యాలను ఎక్కడా తారుమారు చేయలేదు.
  • చంద్రబాబు ఈ కేసులో సహకరిస్తున్నప్పటికీ అరెస్ట్‌కు తొందరపడ్డారు.
  • స్టేట్ గవర్నమెంట్ తన అధికారాన్ని పరిధి దాటి ఉపయోగించిన టైమ్ లో కోర్టులు కలిపించుకోవచ్చు .
  • ఈ కేసు కేవలం జీఎస్టీ కేసు మాత్రమే, గవర్నమెంట్ కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.
  • ఈ కేసులో హరీష్ సాల్వే అర్ణబ్ గోస్వామి కేసు తీర్పును ఉదహరించారు.
  • తేజ్‍మాల్ చౌదరి వర్సెస్  స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు గురించి హరీష్ సాల్వే ప్రస్తావించారు.
    సిద్ధార్థ లూథ్రా వాదనలు..
  • చంద్రబాబు నాయుడిని అరెస్ట్‌ చేసిన విధానం పై అభ్యంతరాలున్నాయి.
  • ఈ ఎఫ్ఐఆర్‌ ఒక వేళ 2018 సవరణ కన్నా ముందు రిజిస్టర్ అయ్యి ఉంటే మేము అడిగేవాళ్లం కాదు.
  • కానీ ఎఫ్ఐఆర్‌ 2020లో రిజిస్టర్ అయ్యింది. కాబట్టి అరెస్ట్‌ చేయాలంటే రాష్ట్ర గవర్నర్‌ పర్మిషన్ తప్పనిసరి.
  • ప్రీవెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ క్రింద ప్రజాప్రతినిధి పై కేసు రిజిస్టర్ చేసే టైమ్ లో గవర్నర్ పర్మిషన్ తప్పనిసరి
  • 2020లో టీడీపీ నేత అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేసిన సమయంలో ఇలాగే జరిగింది.
  • సిద్ధార్థ లూథ్రా కర్ణాటక కేసును ఉదహరించి, 17Aలో ముందస్తు పర్మిషన్ అవసరమని వాదించారు.Also Read: జైల్లో ఖైదీలకు నంబర్లు ఎలా ఇస్తారు..? చంద్రబాబు నాయుడుకి 7691 అనే నంబర్ ఎలా ఇచ్చారు..?

End of Article

You may also like