Ads
లేడీ పవర్ స్టార్ గా పేరుగాంచిన, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనతో, సినిమాల ఎంపికలో తనదైన ముద్రను వేసి టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపును, ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.
Video Advertisement
సాయి పల్లవి పెళ్లి పై గతంలో ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే కొద్ది రోజుల నుండి సాయి పల్లవి పెళ్లి ఫోటో అంటూ, రహస్యంగా పెళ్లి చేసుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా సాయి పల్లవి పెళ్లి రూమర్స్ పై స్పందించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫిదా మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సాయి పల్లవి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుసగా తెలుగు చిత్రాలలో నటిస్తూ, లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఆమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. విరాట పర్వం మూవీ తరువాత కాస్త విరామం తీసుకున్న సాయి పల్లవి తమిళంలో ఒక చిత్రాన్ని, తెలుగులో నాగచైతన్యతో ఒక సినిమాని అంగీకరించింది.అయితే కొద్ది రోజులుగా సాయి పల్లవి రహస్యంగా ఒక డైరెక్టర్ ని ప్రేమించి, పెళ్లి చేసుకుందని రూమర్స్, దానికి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో సాయి పల్లవి, కోలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియస్వామి పూలదండలతో ఉన్నారు. అయితే అవన్నీ రూమర్స్. సాయి పల్లవి కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ (SK21) సినిమాలో నటిస్తుంది. ఆ మూవీ ప్రారంభోత్సవంలో జరిపిన పూజలో డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామితో పాటు సాయి పల్లవి పాల్గొంది. ఆ సమయంలో పూజారులు వారికి దండలు వేసి, క్లాప్ కొట్టటం, స్క్రిప్ట్ అందించారు.ఈ ఫోటోలను దర్శకుడు రాజ్ కుమార్ పరియసామి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ విషయం పై తాజాగా సాయి పల్లవి సీరియస్ ట్వీట్ చేసింది. “ఇటువంటి రూమర్స్ అసలు పట్టించుకోనని, కానీ ఈ రూమర్స్ వల్ల కుటుంబం, ఫ్రెండ్స్ ఇబ్బంది పడితే చూస్తూ ఉండలేను. ఆ ఫోటో ఒక మూవీ పూజా కార్యక్రమంలో తీసిన ఫోటో అని, కొంతమంది కావాలనే డబ్బులు ఇచ్చి ప్రచారాలను పుట్టిస్తున్నారని పేర్కొంది. ఇలాంటి పనులు ఇప్పటికైనా ఆపండి. ఇంతకన్నా నీచమైన పని మరొకటి ఉండదు.” అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
End of Article