Ads
వినాయక చవితి సందర్భంగా తెలంగాణలో వీధి, వీధికో గణపతిని పెట్టి, భక్తులు భక్తి శ్రద్దాలతో పూజిస్తున్నారు. ఎక్కడ చూసిన వినాయకుడి పాటలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో గణేషుడి కోసం గల్లీ గల్లీలో మండపాలు వేసి, కొలువుదీరిన గణపయ్యకు పూజలు చేస్తూ, ఆరాధిస్తున్నారు.
Video Advertisement
చందాలు వేసుకుని, యువకులు, పెద్దలు గణపతిని పెడుతుంటారు. 9 రోజులు చాలా నిష్టగా ఆ బొజ్జ గణపయ్యను కొలుస్తారు. గణపతిని నిమజ్జనం చేసేవరకు పగలు రాత్రి గణపతి మండపంలో గణనాధుని సేవలో చేస్తూ, అక్కడే ఉంటారు. అయితే కొందరు దేవుడి మండపంలోనే అదును చూసి హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గుడిలో దేవుడి సన్నిధికి భక్తితో, స్కూల్ కు శ్రద్దాసక్తులతోనూ వెళ్లాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుత సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దేవుడు అంటే పాపభీతి లేదు. చదువు నేర్పే గురువులకు గౌరవం ఇవ్వడం లేదు. ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక వైపు వినాయక చవితి వేడుకలను జరుపుకుంటూ, భక్తితో పూజలు చేస్తుంటే, మరో వైపు మండపాల వద్ద ఏమాత్రం ఆలోచన లేకుండా కొందరు దొంగతనాలు చేస్తుంటే మరికొందరు వెకిలి వేషాలు వేస్తున్నారు.
మియాపూర్‌లో రెండు రోజుల కిందట ఒక గణపతి మండపంలో దేవుడికి కూడా భయపడకుండా ఒక వ్యక్తి గణపతి చేతిలోని లడ్డును దొంగిలించడం తెలిసిందే. తాజాగా మేడ్చల్ లోని రాఘవేంద్రనగర్ కాలనీలో గణేష్ మండపంలో నిద్రిస్తున్న యువకుల వద్దకి వచ్చిన ఒక దొంగ, అర్ధరాత్రి 1: 50 నిమిషాలకు మండపలోకి వచ్చి, పడుకున్నవారి తల దగ్గర పెట్టుకున్న సెల్ ఫోన్లను సైలెంట్‌గా తీసుకున్నాడు. వారిలో ఒకరు కదులుతున్నా, కొంచెం కూడా భయపడకుండా మెల్లగా సెల్ ఫోన్లను తీసుకుని పారిపోయాడు.
అలికిడికి లేచిన ఒక యువకుడు చూసేసరికి, దొంగ పరారయ్యాడు. మిగతా ఫ్రెండ్స్ ను కూడా లేపి, దొంగ కోసం వెతికారు. అప్పటికే పారిపోయిన దొంగ దొరకలేదు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: తిరుమలలో పట్టుబడిన మరొక చిరుత..! ఇప్పటివరకు దొరికిన చిరుతల సంఖ్య ఎంతంటే..?
End of Article