ఆనందం “రేఖ” ఇలా మారిపోవడానికి కారణం ఇదేనా..? అసలు విషయం ఏంటంటే..?

ఆనందం “రేఖ” ఇలా మారిపోవడానికి కారణం ఇదేనా..? అసలు విషయం ఏంటంటే..?

by kavitha

Ads

ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు కొన్ని చిత్రాలలోనే నటించినప్పటికీ, మంచి గుర్తింపు సొంతం చేసుకుని, ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తారనుకున్న టైమ్ లో ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

Video Advertisement

అలా ఇండస్ట్రీకి దూరం అయిన హీరోయిన్లలో రేఖ ఒకరు. ఒకప్పుడు ప్రేమకథ చిత్రాలకు చాలా ఫేమస్ రేఖ. అప్పటి యూత్ తమకు ఇలాంటి ప్రేయసి ఉండాలి అని భావించేవారు. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించిన  రేఖ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారింది. రేఖ ఇలా అయిపోవడానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. రేఖ ఆనందం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వచ్చిన ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో యువతకు రేఖ మరింత చేరువైంది. ఆ మూవీ తరువాత వరుసగా ఆఫర్స్ వచ్చాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ రేఖకు అవకాశాలు వచ్చాయి. అయితే టాలీవుడ్ లో రేఖకు మంచి హిట్లు వచ్చాయి. అయితే ఆ తరువాత రేఖ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమె కొన్ని సినిమాలలో సైడ్ హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత టాలీవుడ్ కు దూరం అయ్యింది.
చాలా రోజుల తరువాత రేఖ బుల్లితెర పై మెరిసింది. అయితే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. బాగా చిక్కిపోయింది. ఏదో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేఖ తన ఆరోగ్య సమస్య గురించి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో పాల్గొంది.ఆ షోలో రేఖ మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఎత్తు పల్లాలు ఉంటాయి. అది సహజం, మన వృత్తిని చూసి అలా జరగవు. అయితే ఏం జరిగినా కూడా లైఫ్ లో ముందుకు వెళ్ళాలని, జీవితంలో జరిగిన ప్రతీ సంఘటన లైఫ్ లో గుణపాఠం లాంటిది.
తనకు కొన్ని హెల్త్ ప్రాబ్లెమ్స్ వచ్చాయని, ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. అనుకోకుండా జరిగింది. అయితే చాలా మందికి హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉంటాయి. చిన్నవి అయినా, పెద్ద వ్యాధి అయినా ఒత్తిడికి లోనవ్వద్దు. ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు మరింతగా పెరుగుతాయని చెప్పుకొచ్చారు.

Also Read: “ఏమయ్యా బుచ్చి బాబు..? ఈ స్టోరీ ఏంటయ్యా..?” అంటూ… లీక్ అయిన “రామ్ చరణ్-బుచ్చి బాబు” సినిమా స్టోరీపై కామెంట్స్..!


End of Article

You may also like