మగవాళ్లు తమ ఎమోషన్స్ ని అస్సలు బయటికి చెప్పరు అనుకుంటాం..! కానీ దానికి కారణం ఏంటో తెలుసా..?

మగవాళ్లు తమ ఎమోషన్స్ ని అస్సలు బయటికి చెప్పరు అనుకుంటాం..! కానీ దానికి కారణం ఏంటో తెలుసా..?

by kavitha

Ads

సంతోషం పంచుకుంటే పెరుగుతుందని, బాధలు పంచుకుంటే తగ్గుతాయి అని పెద్దలు చెబుతారు. ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది వర్క్ టెన్షన్ వల్లనో, ఆర్ధిక ఇబ్బందుల వల్లనో, ఆరోగ్య సమస్యల వల్లనో, జీవితంలో ఎదురయ్యే  సమస్యల వల్ల చాలా బాధ పడుతూ ఉంటారు.

Video Advertisement

ఈ విషయాలను ఎవరితోనూ పంచుకోకపోవడం వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు వారి ఆలోచనలు, బాధలు ఇతరులతో పంచుకుంటారు. అయితే మగవారు మాత్రం ఎప్పుడు తమ బాధలను కానీ, తమ భావాలను కానీ ఎవరితోనూ షేర్ చేసుకోరు. అలా చేయడానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఎవరైన తమ భావాలను ఇతరులతో ఎక్కువగా షేర్ చేసుకుంటుంటే, వారిని బలహీనులు అని అంటుంటారు. అందువల్ల ఎవరైతే వారు బలంగా ఉన్నానని నిరూపించుకోవడానికి తన భావాలను, బాధలను వారిలోనే ఉంచుకుంటారట. వెల్‌నెస్ కోచ్, ఎన్సో వెల్‌నెస్ ఫౌండర్ అరుబా కబీర్ మగవారు వారి ఆలోచనలు బయటకు చెప్పకపోవడానికి కారణాలను వెల్లడించారు.
మగవారిని సమాజంలో బలమైనవారిలా సమాజంలో చిత్రీకరించారు. అందువల్ల, వారి ఆలోచనలను ఎప్పుడు  బయటికి చెప్పుకోరు. వారు బాధను వారిలోనే దాచుకుంటారు. కానీ ఎదుటివారికి చెప్పుకోరు. వారు ఒకవేళ ఇతరులతో వారి బాధలను కానీ, ఆలోచనలను కానీ పంచుకుంటే, వారు తమను చులకనగా చూస్తారని, అలా చేయడం వల్ల బాధ పడాల్సి వస్తుంది. కాబట్టి, మగవారు వారి ఆలోచనలను ఇతరులకు చెప్పడానికి భయపడతారట.
అయితే, అసలు మగవారు వారి బాధలు చెప్పుకుంటే వచ్చే ప్రయోజనం గురించిన నిపుణులు చెబుతున్నారు. మగవారు వారి ఆలోచనల గురించి ఇతరులకు చెబితే వారి ఒత్తిడి తగ్గుతుంది. వారి భావాలను సంతోషంగా ఎక్స్‌ప్రెస్ చేసినపుడు నిరాశ మరియు మానసిక సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు. బాధలు, మానసిక ఆరోగ్యం, ఎమోషన్స్ గురించి ఇతరులతో మాట్లాడటానికి మగవారికి అవగాహన పెంచడం ముఖ్యం. వారి ఆలోచనల్ని స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో షేర్ చేసుకోవడం ముఖ్యం అని అంటున్నారు.

Also Read: పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ కి పెళ్లి మండపంలోనే బాండ్ రాసిచ్చిన వధువు…ఇలాంటి భార్య దొరకడం నిజంగా అదృష్టమే.!


End of Article

You may also like